అటు ‘ఆపరేషన్ ముస్కాన్’.. ఇటు ‘ఆపరేషన్ స్మైల్’.. వేల మంది పిల్లలకు విముక్తి

| Edited By:

Jan 04, 2020 | 10:12 PM

తప్పిపోయిన బాలబాలికలు, బాల కార్మికులు, అనాథ పిల్లలను గుర్తించడం కోసం తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఏపీలో ఆపరేషన్ ముస్కాన్, తెలంగాణలో ఆపరేషన్ స్మైల్ పేరుతో పిల్లలను గుర్తించి.. వారిని తల్లిదండ్రుల వద్దకు, అనాథలకు పునరావాసం కల్పించే బాధ్యతలను తీసుకున్నారు. ఈ క్రమంలో ఏపీలోని అన్ని జిల్లాల్లో రెండు రోజుల నుంచి ఆపరేషన్‌ ముస్కాన్‌ను నిర్వహిస్తోన్న పోలీసుల.. వందల్లో పిల్లలను రక్షించారు. తాజాగా విజయనగరం జిల్లాలో 31మంది, ప్రకాశం జిల్లాలో దాదాపు 750, శ్రీకాకుళం […]

అటు ఆపరేషన్ ముస్కాన్.. ఇటు ఆపరేషన్ స్మైల్.. వేల మంది పిల్లలకు విముక్తి
Follow us on

తప్పిపోయిన బాలబాలికలు, బాల కార్మికులు, అనాథ పిల్లలను గుర్తించడం కోసం తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఏపీలో ఆపరేషన్ ముస్కాన్, తెలంగాణలో ఆపరేషన్ స్మైల్ పేరుతో పిల్లలను గుర్తించి.. వారిని తల్లిదండ్రుల వద్దకు, అనాథలకు పునరావాసం కల్పించే బాధ్యతలను తీసుకున్నారు. ఈ క్రమంలో ఏపీలోని అన్ని జిల్లాల్లో రెండు రోజుల నుంచి ఆపరేషన్‌ ముస్కాన్‌ను నిర్వహిస్తోన్న పోలీసుల.. వందల్లో పిల్లలను రక్షించారు.

తాజాగా విజయనగరం జిల్లాలో 31మంది, ప్రకాశం జిల్లాలో దాదాపు 750, శ్రీకాకుళం జిల్లాలో 30, విశాఖ జిల్లాలో 50, విజయవాడలో 128, తూర్పు గోదావరి జిల్లాలో 35మంది పిల్లలను పోలీసులు రక్షించారు. అలాగే మిగిలిన జిల్లాల్లోనూ కలిపి మొత్తం 3,636మందిని పోలీసులు రెస్క్యూ చేశారు. ఇక బాల కార్మికులతో పని చేయించుకుంటోన్న యజమానులపై కేసులు నమోదు చేశారు. ఇంటి నుంచి పారిపోయిన పిల్లలు, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. ఈ ఆపరేషన్‌లో పోలీస్ శాఖతో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, విద్యా, వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, క్రీడా శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు కూడా భాగస్వామ్యం అయ్యాయి.

ఇటు ఆపరేషన్ స్మైల్:
తెలంగాణలో ఆపరేషన్ స్మైల్‌లో భాగంగా తాజాగా జనగామలో తప్పిపోయిన ఇద్దరు పిల్లలను గుర్తించారు పోలీసులు. వారిని తల్లిదండ్రులకు అప్పగించారు. మిస్సింగ్ కేసు నమోదైన 10గంటల్లోపే వారిని గుర్తించారు పోలీసులు. తప్పిపోయిన తమ పిల్లలను వెంటనే గుర్తించి తమకు అప్పగించడంపై ఆ పిల్లల తల్లిదండ్రులు పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.