ఆటో డ్రైవర్లకు పోలీస్ శాఖ గుర్తింపు కార్డులు జారీ

|

Feb 15, 2019 | 4:39 PM

వాహనాల తనిఖీల సమయంలో ఆటోడ్రైవర్లకు సంబంధించిన విషయాలను సులువుగా తెలుసుకునేందుకు పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. వరంగల్ జిల్లా నెక్కొండలో ఆటో సంఘాల ఆధ్వర్యంలో పోలీసులు అవగాహన సమావేశాలు ఏర్పాటు చేశారు. స్థానిక ఆటో సంఘాల ఆధ్వర్యంలో వందమందికి పైగా ఆటోడ్రైవర్లకు పోలీసు శాఖ గుర్తింపు కార్డులను జారీ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు ఆటో డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ముందుసీట్లో ప్రయాణికులను కూర్చొబెట్టకుంటే సహించేది లేదన్నారు. ఆటోలో గుర్తింపు కార్డు ఖచ్చితంగా […]

ఆటో డ్రైవర్లకు పోలీస్ శాఖ గుర్తింపు కార్డులు జారీ
Follow us on

వాహనాల తనిఖీల సమయంలో ఆటోడ్రైవర్లకు సంబంధించిన విషయాలను సులువుగా తెలుసుకునేందుకు పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. వరంగల్ జిల్లా నెక్కొండలో ఆటో సంఘాల ఆధ్వర్యంలో పోలీసులు అవగాహన సమావేశాలు ఏర్పాటు చేశారు. స్థానిక ఆటో సంఘాల ఆధ్వర్యంలో వందమందికి పైగా ఆటోడ్రైవర్లకు పోలీసు శాఖ గుర్తింపు కార్డులను జారీ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు ఆటో డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ముందుసీట్లో ప్రయాణికులను కూర్చొబెట్టకుంటే సహించేది లేదన్నారు. ఆటోలో గుర్తింపు కార్డు ఖచ్చితంగా అతికించాలన్నారు. ఈ గుర్తింపు కార్డులో ప్రయాణికులకు ఉపయోగపడేలా డ్రైవర్ అనుభవంతో పాటుగా లైసెన్స్, బ్లడ్ గ్రూప్ వంటి అంశాలు ఉంటాయని తెలిపారు. వీటి ద్వారా ప్రయాణికులు ఆటో డ్రైవర్ వివరాలు తెలుసుకునే వీలుంటుందని పోలీసులు తెలిపారు.