ప్రయాణికులకు షాక్: ఫ్లాట్‌ఫామ్ టికెట్ ధర భారీగా పెంపు..?

| Edited By:

Sep 28, 2019 | 7:29 PM

దసరా పండుగ పండుగ వచ్చింది.. అటు ఆఫర్లు ఇస్తూనే.. మరోపక్క ప్రజలకు వడ్డింపులు మొదలవుతాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం రైల్వే ప్రయాణికులక షాక్‌ ఇచ్చింది. రైల్వే ఫ్లాట్‌ఫామ్ టికెట్‌ ధరను పెంచుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది. ఫ్లాట్‌ ఫామ్ టికెట్ ధరను రూ.10 నుంచి 30 రూపాయలు పెంచుతున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 10వ తేదీ వరకూ పెంచిన ఈ ఫ్లాట్ ఫామ్ టికెట్ల ధరలు అమలులో ఉండనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. గతంలో కూడా.. ఈ […]

ప్రయాణికులకు షాక్: ఫ్లాట్‌ఫామ్ టికెట్ ధర భారీగా పెంపు..?
Follow us on

దసరా పండుగ పండుగ వచ్చింది.. అటు ఆఫర్లు ఇస్తూనే.. మరోపక్క ప్రజలకు వడ్డింపులు మొదలవుతాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం రైల్వే ప్రయాణికులక షాక్‌ ఇచ్చింది. రైల్వే ఫ్లాట్‌ఫామ్ టికెట్‌ ధరను పెంచుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది. ఫ్లాట్‌ ఫామ్ టికెట్ ధరను రూ.10 నుంచి 30 రూపాయలు పెంచుతున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 10వ తేదీ వరకూ పెంచిన ఈ ఫ్లాట్ ఫామ్ టికెట్ల ధరలు అమలులో ఉండనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. గతంలో కూడా.. ఈ పండగ సమయంలోనే.. రూ.10 నుంచి రూ.20 పెంచారు. ఇప్పుడు ఏకంగా 30 రూపాయలు పెంచడంతో.. ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే.. ఈ పెంచిన ధరలు ఆంధ్రప్రదేశ్‌లోని మూడు స్టేషన్లలోనే అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విజయవాడ, నెల్లూరు, రాజమండ్రి జిల్లాల్లో ఈ కొత్త ధరలు అమ్మల్లోకి రానున్నాయి. దసరా పండుగకు ఊళ్లల్లో.. రద్దీ మామూలుగా ఉండదు. అందులోనూ ట్రైన్ టికెట్ల ధరలు.. తక్కువగా ఉంటాయి. అందుకని.. జనాలు రైళ్లకు ఎగబడుతూంటారు. కాగా.. అక్టోబర్ 10 తర్వాత మళ్లీ పాత రేట్లే అమలు కానున్నాయి.