Alert: రైల్వే ప్రయాణీకులకు అలర్ట్.. పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు.. పూర్తి వివరాలివే

|

Sep 05, 2022 | 8:54 AM

రైల్వే ప్రయాణీకులకు సౌత్‌ ఈస్ట్రన్‌ సెంట్రల్‌ రైల్వే (SECR) కీలక అప్డేట్ జారీ చేసింది. పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. అంతే కాకుండా మరికొన్ని రైళ్ల గమ్యాలు కుదించినట్లు తెలిపింది. లఖోలి - రాయపూర్‌ స్టేషన్ల మధ్య రెండో..

Alert: రైల్వే ప్రయాణీకులకు అలర్ట్.. పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు.. పూర్తి వివరాలివే
railways
Follow us on

రైల్వే ప్రయాణీకులకు సౌత్‌ ఈస్ట్రన్‌ సెంట్రల్‌ రైల్వే (SECR) కీలక అప్డేట్ జారీ చేసింది. పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. అంతే కాకుండా మరికొన్ని రైళ్ల గమ్యాలు కుదించినట్లు తెలిపింది. లఖోలి – రాయపూర్‌ స్టేషన్ల మధ్య రెండో లైన్‌ పనులు, రాయపూర్‌ స్టేషన్‌, యార్డు ఆధునికీకరణ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు వాల్తేరు సీనియర్‌ డీసీఎం ఏ.కే.త్రిపాఠి వివరాలు వెల్లడించారు. 18158 నంబర్ కలిగిన విశాఖ-కోర్బా ఎక్స్ ప్రెస్ ఈనెల 11న, కోర్బా-విశాఖ(18517) 12న రద్దు చేశారు. విశాఖ-దుర్గ్‌ మధ్య రాకపోకలు సాగించే 18530 ను 6 నుంచి 12 వరకు, 7 నుంచి 13 వరకు దుర్గ్‌ – విశాఖ 18529 రైలును రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. 08528 నంబర్ కలిగిన విశాఖ – రాయపూర్ ఎక్స్ ప్రెస్ ను ఈ నెల 6 నుంచి 12 వరకు, రాయపూర్‌ – విశాఖ 08527 ను మహాసముండ – రాయపూర్‌ – మహాసముండ స్టేషన్ల మధ్య రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రయాణీకులు ఈ మార్పులను గమనించాలని కోరారు.

రద్దు చేసిన రైళ్లతో పాటు పలు రైళ్ల గమ్య స్థానాలు, రూట్లు మార్పు చేశారు. తిరుపతి-బిలాస్‌పూర్‌ 17482 రైలు ఈ నెల 8, 11 తేదీల్లో టిట్లాఘర్, సంబల్ పూర్, జార్సుగూడ మధ్య దారి మళ్లించారు. వీటితో పాటు బిలాస్‌పూర్‌-తిరుపతి 17481 రైలు, పూరీ-అహ్మదాబాద్‌12843, అహ్మదాబాద్‌-పూరీ 12844 రైళ్లు కూడా ఇదే మార్గంలో నడవనున్నాయి. 8, 15 తేదీల్లో 12897 నంబర్ గల విశాఖ – నిజాముద్దీన్‌ సమతా ఎక్స్‌ప్రెస్‌ 2 గంటలు, 12న హజ్రత్‌ నిజాముద్దీన్‌ – విశాఖ 12808 రైలు 5 గంటలు ఆలస్యంగా బయలుదేరతాయి. 15 న తిరుపతి – బిలాస్‌పూర్‌ 4 గంటలు, విశాఖ-భగత్‌ కీ- కోఠి 5 గంటలు ఆలస్యంగా బయలు దేరనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..