ఏపీలో పశువులకూ.. ఆధార్ గుర్తింపు..!!

| Edited By:

Oct 23, 2019 | 12:40 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. పాడి పశువులకూ.. ఆధార్ గుర్తింపు సౌకర్యం కల్పించింది. పశుసంవర్థక శాఖ ఈ వినూత్న ప్రయోగం చేపట్టింది. రాష్ట్రంలోని పశువులకు ఆధార్‌ను కల్పించేందుకు సిద్ధం అయ్యింది. కేంద్రం సహాయంతో ఈ ఆధార్ గుర్తింపు ఇవ్వబోతున్నది. పశువులకు ఆధార్ ఈ ట్యాగ్‌ను వేస్తున్నారు. ఈ ట్యాగ్ వేయడం ద్వారా.. దేశంలో ఎక్కడి నుంచైనా పశువుల వ్యాపారం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ట్యాగ్ ద్వారా ఆన్‌లైన్ ట్రేడింగ్ జరుపుకోవచ్చు. అంతేగాక.. ఈ ట్యాగ్‌ను చేయడం ద్వారా.. అటు […]

ఏపీలో పశువులకూ.. ఆధార్ గుర్తింపు..!!
Follow us on

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. పాడి పశువులకూ.. ఆధార్ గుర్తింపు సౌకర్యం కల్పించింది. పశుసంవర్థక శాఖ ఈ వినూత్న ప్రయోగం చేపట్టింది. రాష్ట్రంలోని పశువులకు ఆధార్‌ను కల్పించేందుకు సిద్ధం అయ్యింది. కేంద్రం సహాయంతో ఈ ఆధార్ గుర్తింపు ఇవ్వబోతున్నది. పశువులకు ఆధార్ ఈ ట్యాగ్‌ను వేస్తున్నారు. ఈ ట్యాగ్ వేయడం ద్వారా.. దేశంలో ఎక్కడి నుంచైనా పశువుల వ్యాపారం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ట్యాగ్ ద్వారా ఆన్‌లైన్ ట్రేడింగ్ జరుపుకోవచ్చు.

అంతేగాక.. ఈ ట్యాగ్‌ను చేయడం ద్వారా.. అటు రైతులకు కూడా అనేక లాభాలు చేకూరుతాయి. అంతేకాకుండా.. ఈనాఫ్ యాప్‌తో ఆధార్ నెంబర్ అనుసంధానం చేయడం ద్వారా.. పాడిపశువులకు ప్రత్యేక ఆరోగ్య సదుపాయం కల్పిస్తుంది ప్రభుత్వం. ట్యాగ్‌కు ఉన్న కోడ్‌ను ఆధారంగా పశువు గురించిన అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా.. పశువులకు ఎద ఇంజక్షన్లు.. ఎప్పుడు ఇవ్వాలి? ఎప్పుడు దూడను ఈనుతుంది? వాటి ఆరోగ్యం, నిర్థారణ, ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది..? అనే విషయాలు చాలా ఈజీ తెలుసుకోవచ్చు.

అంతేకాకుండా.. పాడిపశువులకు ఏఏ జబ్బులు ఉన్నాయి..? ఎన్ని మందులు వాడాలి.? అనే అంశాలను ఈ యాప్‌లో నమోదు చేస్తారు. ఒకవేళ.. పాడి పశువు అపహరణకు గురైనా.. అది ఎక్కడుందో ఈ యాప్‌తో తెలుసుకోవచ్చు. దీనికి ఇన్ని ప్రయోజనాలు ఉండటంతో.. దీనికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. తాజాగా ఇప్పుడు దీన్ని అనంతపురం జిల్లాలో ప్రవేశపెట్టారు. ఇప్పటికే చాలా పశువులకు ఈట్యాగ్స్ ఇచ్చారు.