Breaking: రొట్టెల పండుగ రద్దు.. ఉత్తర్వులు జారీ

| Edited By:

Aug 28, 2020 | 11:38 AM

ఏపీలో రొట్టెల పండుగ రద్దైంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రొట్టెల పండుగను రద్దు చేస్తూ నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆదేశాలు జారీ చేశారు.

Breaking: రొట్టెల పండుగ రద్దు.. ఉత్తర్వులు జారీ
Follow us on

Rottela Panduga 2020: ఏపీలో రొట్టెల పండుగ రద్దైంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రొట్టెల పండుగను రద్దు చేస్తూ నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆదేశాలు జారీ చేశారు. ఇక రొట్టెల పండుగలో కీలక ఘట్టమైన గంధ మహోత్సవంను కూడా 20 మందితో జరపాలని తెలిపారు.

కాగా మొహర్రం సందర్భంగా నెల్లూరులోని బారాషహీద్ దర్గా, స్వర్ణాల చెరువు సాక్షిగా ప్రతి సంవత్సరం రొట్టెల పండుగ జరిగేది. ఇక్కడ రొట్టె పడితే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. కులమతాలకు అతీతంగా సాగే ఈ పండుగకు దేశం నలుమూలల నుంచి భక్తులు హాజరవుతుంటారు. ఇక 2015లో ఈ పండుగను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించడంతో పాటు ఏర్పాట్లు ఘనంగా చేస్తుండటంతో భక్తుల రాక పెరిగింది. కాగా ఈ ఏడాది ఆగష్టు 30 నుంచి సెప్టెంబర్ 3 వరకు రొట్టెల పండుగ జరగనుంది.

Read More:

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 2,932 కొత్త కేసులు.. 11 మరణాలు

నేడు టీటీడీ పాలక మండలి సమావేశం.. ప్రత్యక్ష ప్రసారం