మంత్రి అవంతి శ్రీనివాస్‌కి కరోనా పాజిటివ్‌

ఏపీలో మరో మంత్రికి కరోనా సోకింది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌కి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది

మంత్రి అవంతి శ్రీనివాస్‌కి కరోనా పాజిటివ్‌

Edited By:

Updated on: Sep 15, 2020 | 10:29 AM

Minister Avanti Srinivas: ఏపీలో మరో మంత్రికి కరోనా సోకింది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌కి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అవంతితో పాటు ఆయన కుమారుడు శివసాయి సందీప్‌కి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. దీంతో ఈ ఇద్దరు హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఈ విషయాన్ని ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. సందర్శకులు ఎవరూ తనను కలిసేందుకు కార్యాలయానికి రావొద్దని అవంతి ఆ ప్రకటనలో కోరారు. కార్యాలయ సిబ్బంది ఫోన్‌లో అందుబాటులో ఉంటారని, ఏ సమస్య వచ్చినా వారిని సంప్రదించాలని మంత్రి సూచించారు.

కాగా ఏపీలో కరోనా కేసుల సంఖ్య 5,75,079కు చేరింది. వారిలో 4,74,008 మంది కరోనాను జయించగా.. 4,792 మంది మరణించారు. ప్రస్తుతం 93,204 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 46,61,355 పరీక్షలను చేశారు.

Read More:

ఆ ముగ్గురి మధ్య ట్రయాంగిల్ లవ్‌స్టోరీ.. మోనాల్ ఏమందంటే

వాయిదాపడ్డ యూజీసీ-నెట్‌, ఓయూ పరీక్షలు

Follow Us