వాయిదాపడ్డ యూజీసీ-నెట్‌, ఓయూ పరీక్షలు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో రేపు, ఎల్లుండి జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసింది. అటు, జాతీయ అర్హత పరీక్ష యూజీసీ-నెట్‌ పరీక్షలు కూడా మరోసారి వాయిదా పడ్డాయి. 

వాయిదాపడ్డ యూజీసీ-నెట్‌, ఓయూ పరీక్షలు
Follow us

|

Updated on: Sep 14, 2020 | 10:36 PM

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పరీక్షలను వాయిదా వేసింది. రేపు, ఎల్లుండి జరగాల్సిన బ్యాచిలర్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, బీసీఏ, బీఫార్మా, బీహెచ్‌ఎంసీటీ, బీసీటీసీఏ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉస్మానియా యునివర్సిటీ ఓ ప్రకటనలో వెల్లడించింది. కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది..  అటు, జాతీయ అర్హత పరీక్ష యూజీసీ-నెట్‌ పరీక్షలు కూడా మరోసారి వాయిదా పడ్డాయి.

పరీక్ష తేదీలను తిరిగి త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది. కాగా, మిగతా పరీక్షలు నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబర్‌ 17న జరగాల్సిన పరీక్ష యథావిధిగా జరగనున్నట్లు స్పష్టం చేసింది. అయితే, యూజీసీ ఆదేశాలకు అనుగుణంగా అన్నీ వర్సిటీలు యూజీ, పీజీ చివరి సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించడానికి అన్నీ యూనివర్సిటీలు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉస్మానియా వర్సిటీ కూడా యూజీ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్‌ విడుదల చేసింది. అయితే కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా కొన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

మరోవైపు జాతీయ అర్హత పరీక్ష యూజీసీ-నెట్‌ పరీక్షలు కూడా మరోసారి వాయిదా పడ్డాయి. ఈ నెల 16 నుంచి 25 వరకు పరీక్షలు జరగాల్సి ఉండగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ షెడ్యూల్‌ను మార్చింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఎఆర్) పరీక్ష తేదీల్లోనే నెట్‌ పరీక్ష సైతం ఉండటంతో కేంద్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ నిర్ణయం తీసుకుంది. నెట్‌ పరీక్షలను ఈ నెల 24 నుంచి నిర్వహిస్తామని ఎన్‌టీఏ సీనియర్ డైరెక్టర్ సాధన పరాశర్ పేర్కొన్నారు. రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నష్టపోకుండా పరీక్షను రీ షెడ్యూల్‌ చేశామని ఆయన వెల్లడించారు. త్వరలో సబ్జెక్టుల వారీగా..షిఫ్ట్ వారీగా షెడ్యూల్ విడుదల చేస్తామని పేర్కొన్నారు.