ముగ్గురు టీడీపీ నేతలకు మావోల వార్నింగ్.. లిస్టులో ఓ మంత్రి

| Edited By:

May 17, 2019 | 9:29 AM

ఏపీ టీడీపీ నేతలను హెచ్చిరిస్తూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో ముఖ్యంగా ముగ్గురు టీడీపీ నేతలను టార్గెట్ చేశారు. మంత్రి అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్, ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిలను హెచ్చిరిస్తూ మన్యంలో ఓ లేఖ వెలుగులోకి వచ్చింది. సీపీఐ మావోయిస్టు పార్టీ ఈస్ట్ డివిజన్ కార్యదర్శి కైలాసం పేరుతో ఈ లేఖ ఉంది. ఆదివాసీల ఓట్లతో గెలిచిన మీరు ఆదివాసీలను ఏం పట్టించుకుంటున్నారని లేఖలో ప్రశ్నించారు. మే 1న వంచుల […]

ముగ్గురు టీడీపీ నేతలకు మావోల వార్నింగ్.. లిస్టులో ఓ మంత్రి
Follow us on

ఏపీ టీడీపీ నేతలను హెచ్చిరిస్తూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో ముఖ్యంగా ముగ్గురు టీడీపీ నేతలను టార్గెట్ చేశారు. మంత్రి అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్, ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిలను హెచ్చిరిస్తూ మన్యంలో ఓ లేఖ వెలుగులోకి వచ్చింది. సీపీఐ మావోయిస్టు పార్టీ ఈస్ట్ డివిజన్ కార్యదర్శి కైలాసం పేరుతో ఈ లేఖ ఉంది.

ఆదివాసీల ఓట్లతో గెలిచిన మీరు ఆదివాసీలను ఏం పట్టించుకుంటున్నారని లేఖలో ప్రశ్నించారు. మే 1న వంచుల పంచాయతీలోని పనసలొద్ది, కొత్త వెదురుపల్లి గ్రామాలపై పోలీసులు దాడులు చేసి.. ఆరుగురు రైతులను అక్రమంగా నిర్బంధించారని.. పోలీసులు వారిని చిత్రహింసలకు గురిచేశారని.. వారిని విడిచిపెట్టాలని గ్రామస్తులు గూడెం పోలీసులు చుట్టూ తిరిగినా పట్టించుకునే వారు లేరంటూ లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు.

మన్యం ప్రజలపై పోలీసుల దౌర్జన్యాలను ఆపాలని.. లేకపోతే అల్లూరి వారసులైన మన్యం ప్రజలు మీకు బుద్ధి చెబుతారని.. రాజ్యహింసలో భాగమైన అధికార టీడీపీ నాయకులపై ప్రజలు, మా పార్టీ తీసుకునే చర్యలకు, పర్యవసానాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని మావోయిస్టులు హెచ్చరిక జారీ చేశారు.

గతంలో కూడా మావోయిస్టులు దాదాపు ఇవే కారణాలతో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమాను కాల్చి చంపారు. ఆ తర్వాత కిడారి సర్వేశ్వరరావు కుమారుడు శ్రావణ్ కుమార్ మంత్రి అయ్యారు. అయితే, ఆరు నెలలలోపు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా ఎన్నిక కాకపోవడంతో ఇటీవలే శ్రావణ్ రాజీనామా చేశారు.