విశాఖ ‘రేవ్’ పార్టీలో ఎవరెవరిది ఎంత పాత్ర..?

| Edited By:

Apr 19, 2019 | 12:21 PM

విశాఖపట్టణంలో సంచలనంగా మారిన రేవ్ పార్టీ డ్రగ్స్ కేసు దర్యాప్తును పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కాల్‌డేటా ఆధారంగా ఇతర నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు. కోడ్ లాంగ్వేజ్‌లో వీరు డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న విషయం కూడా బయటపడింది. కోడ్ డీకోడ్ లాంగ్వేజీలో ఓ వెబ్‌సెట్‌ను నడుపుతున్న కొందరు ఆన్‌లైన్‌లో డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం సోషల్ మీడియాలో ప్రత్యేక గ్రూపులు […]

విశాఖ ‘రేవ్’ పార్టీలో ఎవరెవరిది ఎంత పాత్ర..?
Follow us on

విశాఖపట్టణంలో సంచలనంగా మారిన రేవ్ పార్టీ డ్రగ్స్ కేసు దర్యాప్తును పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కాల్‌డేటా ఆధారంగా ఇతర నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు. కోడ్ లాంగ్వేజ్‌లో వీరు డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న విషయం కూడా బయటపడింది. కోడ్ డీకోడ్ లాంగ్వేజీలో ఓ వెబ్‌సెట్‌ను నడుపుతున్న కొందరు ఆన్‌లైన్‌లో డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం సోషల్ మీడియాలో ప్రత్యేక గ్రూపులు కూడా ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు.

మరోవైపు ఈవెంట్ ఆర్గనైజర్ వీరరాఘవ అలియాస్ సోను వివిధ రాష్ట్రాల డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉండగా.. గాలింపు చర్యలను చేపట్టారు. ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న యువతీ యువకుల్లో కొంతమంది రాజకీయ నాయకుల పిల్లలు కూడా ఉన్నారని.. వారి పేర్లను పోలీసులు రహస్యంగా ఉంచుతున్నారని ఇదివరకే వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో బహిరంగ ప్రదేశానికి సమీపంలోనే ఉన్న రిషికొండ బీచ్‌లో డ్రగ్స్ వాడకానికి పోలీసులు ఎలా అనుమతి ఇచ్చారన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో కొంతమంది ఎక్సైజ్ పోలీసుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.