Indian Navy Milan 2022: విశాఖ చరిత్రలో ఇది గర్వించదగ్గ రోజు.. మిలాన్‌-2022లో సీఎం జగన్..

|

Feb 28, 2022 | 6:39 AM

నేవీ పరేడ్‌తో మురిసిపోయింది విశాఖ సాగర తీరం. ఆర్కే బీచ్‌లో నేవీ ఆధ్వర్యంలో పరేడ్‌ అద్భుతంగా జరిగింది. థింసా, కోయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Indian Navy Milan 2022: విశాఖ చరిత్రలో ఇది గర్వించదగ్గ రోజు.. మిలాన్‌-2022లో సీఎం జగన్..
Navy Milan
Follow us on

సముద్రంలో యుద్ధ విన్యాసాలు, గగనతలంలో వాయుసేన విన్యాసాలతో సందడిగా మారింది విశాఖ తీరం(Visakhapatnam port ). మిలాన్‌-2022(Navy Milan 2022) ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ను ప్రారంభించారు సీఎం జగన్. దీంట్లో 39 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. గంటన్నరపాటు జరిగిన సముద్ర యుద్ధ విన్యాసాలు, గగనతల వాయుసేన విన్యాసాలను వీక్షించారు సీఎం జగన్‌. రాకెట్‌ల ద్వారా శత్రువులపై నేవీ టీం చేసే బాంబ్ బ్లాస్టింగ్ ఫీట్ ఔరా అనిపించింది. సముద్రంలో చిక్కుకున్న జాలర్ల కోసం నేవీ టీం తీసుకునే చర్యలు అద్భుతంగా ఉన్నాయి. తుఫాన్లు, సునామీల సమయంలో జాలర్లు సముద్రంలో చిక్కుకుపోవడం రెగ్యులర్‌గా జరిగే ప్రమాదాలే. అలాంటి సమయంలో వారిని ఎలా కాపాడతారనేది నేవీ చేసి చూపించింది. ఇక గగనతలంలో పారాచూట్‌లతో నేవీ సేనలు అద్భుత ప్రదర్శన చేశాయి.

త్రివర్ణ పతాకాన్ని గగన తలంలో రెపరెపలాడించాయి. యుద్ద విమానాలు, రాకెట్ ద్వారా నేవీ టీం చేసే కైట్ పార్మేషన్ ఆకట్టుకుంది. మిగ్ 29 విమానం గాల్లో ఎగురుతూ చేసిన విన్యాసాలు అధరహో అనిపించాయి. మన సంస్కృతీ, పాంప్రదాయాలు ప్రతిబింబించేలా చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలు సాగర తీరంలో ఆకర్షణగా నిలిచాయి.

మిలాన్ 2022లో పాల్గొన్న 39 దేశాల జాతీయ జెండాలతో పరేడ్ నిర్వహించారు కమాండోలు. సిటీ పరేడడ్‌లో నేవీ సిబ్బంది గౌరవ వందనం, వివిద సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విశాఖపట్నంలో మిలాన్‌-2022 నిర్వహించడం గర్వకారణమన్నారు సీఎం జగన్. విశాఖ చరిత్రలో ఇది గర్వించదగ్గ రోజని అన్నారు. అరుదైన వేడుక, విన్యాసాల పండగ అని కితాబిచ్చారు ముఖ్యమంత్రి. ఇటీవల తూర్పు నౌకాదళ స్థావరంలో ఐఎన్‌ఎస్‌ విశాఖ చేరిందని చెప్పారు సీఎం జగన్.