Visakhapatnam Airport: గులాబ్ ఎఫెక్ట్‌తో ఉత్తరాంధ్ర విలవిల్లాడుతోంది. విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ సైతం వరద ముంపులో చిక్కుకుంది. కుండపోత వర్షానికి విశాఖపట్నం నీట మునిగింది. ఏకంగా ఎయిర్‌పోర్ట్‌ను వరద నీరు ముంచెత్తుతోంది. ఏకంగా రన్‌వే ను సైతం వరద ముంచెత్తుతోంది.
విశాఖ ఎయిర్‌పోర్టుకు వరద ముప్పు అంత కంతకు పెరుగుతోంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి ఎగువన ఉన్న మేఘాద్రి రిజర్వాయర్ నిండిపోయింది. దీంతో జలాశయం నుండి దిగువకు వరద నీరు పోటెత్తుతోంది. ఆ ప్రవాహం విశాఖ ఎయిర్‌పోర్ట్ వరకూ వెళ్లింది. ప్రస్తుతం విశాఖ విమానాశ్రయంలో ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది.
ఇది ఎయిర్‌పోర్టా.. చెరువా.. అన్నట్టు పరిస్థితి తయారైంది. వరద నీరు చేరడంతో ప్రయాణికుల అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. గంట గంటకు నీటి ప్రవాహం పెరుగుతోంది. రన్‌వేను పూర్తిగా ముంచెత్తే ప్రమాదం ఉందని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. దీంతో విశాఖ ఎయిర్‌పోర్టుకు వరద ముప్పు పొంచివుందని అధికారులు సైతం హెచ్చరిస్తున్నారు.
Read Also…. Hyderabad City Police: బయట బోరున వర్షం.. ఇంతలోనే మహిళకు పురిటి నొప్పలు.. పోలీసులు ఏం చేశారంటే..