GVMC Demolition: విశాఖలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పల్లా భవనం కూల్చివేత.. అక్రమ నిర్మాణాలను కూల్చివేశామన్న జీవీఎంసీ అధికారులు

విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నేత ఇంటి కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‎కి చెందిన బిల్డింగ్‎ను గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కూల్చివేశారు.

GVMC Demolition: విశాఖలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పల్లా భవనం కూల్చివేత.. అక్రమ నిర్మాణాలను కూల్చివేశామన్న జీవీఎంసీ అధికారులు
Demolition Of Tdp Former Mla Palla Srinivas Building

Updated on: Apr 25, 2021 | 8:30 AM

Ex MLA Palla Srinivas Building Demolition :విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నేత ఇంటి కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‎కి చెందిన బిల్డింగ్‎ను గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కూల్చివేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణం జరిపారంటూ జీవీఎంసీ అధికారులు బిల్డింగ్‎ను కూల్చివేశారు. విషయం తెలుసుకున్న పల్లా శ్రీనివాస్ అక్కడికి చేరుకున్నారు. రాత్రి సమయంలో నిర్మాణాన్ని తొలగించడం అన్యాయమని..నోటీసులు ఇవ్వకుండా భవనాన్ని ఎలా తొలగిస్తారని జీవీఎంసీ సిబ్బందిపై పల్లా శ్రీనివాస్ మండిపడ్డారు

అయితే, మున్సిపల్ నిబంధనలు ఉల్లంఘించి భవన నిర్మాణం చేసినట్లు జీవిఎంసీ అధికారులు తెలిపారు. రోడ్డుకు సెట్ బ్యాక్ వదలలేదంటూ బిల్డింగ్ కూల్చివేశామని అధికారులు వెల్లడించారు. సమాచారం ఇవ్వకుండా భవనాన్ని కూల్చివేయడం దారుణమని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సమాచారం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున్న అక్కడికి చేరుకున్నారు. దీంతో ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీయకుండా భారీగా పోలీసులు మోహరించారు.

కాగా, 2020 జూలై లో భవన నిర్మాణానికి పొందిన అనుమతుల ప్రకారమే నిర్మాణం చేస్తున్నామని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుత అక్విజిషన్ మేరకు రహదారి నిర్మాణానికి స్థలాన్ని వదిలేసి నిర్మాణాన్ని జరుపుతున్నామన్నారు. కానీ భవిష్యత్ లో రహదారికోసం చేపట్టబోయే స్థల సేకరణ కోసం అని కొంత భాగాన్ని కూల్చివేస్తున్నారని ఆరోపించారు. దానికి సంబంధించి కనీసం నోటీస్ లు కూడా ఇవ్వకపోవడం విచారకరం అని పల్లా అన్నారు.

Read Also.. 

 Accident: తిరుపతిలో జనంపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. మహిళ మృతి.. మరొకరికి తీవ్రగాయాలు..

Covid 19 norms Violated: కోవిడ్ నిబంధనలు తుంగలో తొక్కిన మాజీ ఎమ్మెల్యే.. ఓ స్టార్ హీరోతో కలిసి చిందులేసిన జేడీయు నేత