చర్చలు సఫలం..సమ్మె విరమించిన గాంధీ సిబ్బంది!

|

Jul 15, 2020 | 7:56 PM

సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో సమ్మె చేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందితో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. గాంధీ ఆస్పత్రిలో పని చేసే ఔట్ సోర్సింగ్ సిబ్బంది తమ డిమాండ్ల పరిష్కారం కోసం విధులు బహిష్కరించి నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే.

చర్చలు సఫలం..సమ్మె విరమించిన గాంధీ సిబ్బంది!
Follow us on

సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో సమ్మె చేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందితో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. గాంధీ ఆస్పత్రిలో పని చేసే ఔట్ సోర్సింగ్ సిబ్బంది తమ డిమాండ్ల పరిష్కారం కోసం విధులు బహిష్కరించి నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వారితో బుధవారం చర్చలు జరిపింది. ఈ చర్చలు స‌ఫ‌ల‌ం కావడంతో.. గ‌త ఆరు రోజుల నుంచి చేస్తున్న స‌మ్మెను విరమిస్తున్నట్లు సిబ్బంది ప్రకటించారు.

చర్చల సందర్భంగా ప్రభుత్వం వారికి పూర్తి భరోసా కల్పించింది. నర్సులకు ప్రస్తుతమిస్తున్న రూ. 17,500 జీతాన్ని రూ. 25వేలకు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కరోనా విధుల్లో ఉన్న నర్సులకు డైలీ ఇన్సెంటివ్స్‌ కింద రూ. 750 ఇస్తామని, ఉద్యోగులను ఔట్‌ సోర్సింగ్‌ నుంచి కాంట్రాక్టులోకి మార్చేందుకు ప్రయత్నిస్తామంది. 4వ తరగతి ఉద్యోగులకు రోజుకు రూ. 300 ఇన్సెంటివ్స్‌ ఇస్తామంది. ప్రభుత్వ హామీల‌తో స‌మ్మెను విరమిస్తున్నట్లుగా సిబ్బంది ప్రకటించారు. వెంటనే తాము విధుల్లోకి చేరతామ‌ని చెప్పారు.