Araku Ghat Road: భారీ వర్షాలకు విశాఖ ఏజెన్సీలో ఘాట్ రోడ్లు ప్రమాదకరంగా మారాయి. అరకు ఘాట్ రోడ్ లో వరదనీరు ఏరులై ప్రవహిస్తుండగా.. పాడేరు ఘాట్ రోడ్ లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. వర్షాలకు మట్టి కోతకు గురవడంతో బండరాళ్ళు కొండలపై నుంచి రోడ్లపైకి జారుతున్నాయి. వంజంగి కాంతమ్మ ఘాట్ రోడ్ లో కొండచరియలు విరిగిపడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొండచరియలు పడే సమయంలో అటువైపుగ వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.
ఘాట్ రోడ్ కు అడ్డంగా పడిన కొండచరియలను తొలగించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. జేసీబీల సాయంతో రోడ్డుని క్లియర్ చేసే పని ప్రారంభించారు. ఈ పనులు కొనసాగుతుండగానే మరికొన్ని కొండచరియలు జారి అమాంతంగా పడిపోయాయి.
జేసేబీపై కొండచరియలు పడడంతో అంతా పరుగులు తీశారు. రాళ్ళ ధాటికి భారోగా చెట్లు కూడా కూలి రోడ్డుపై పడ్డాయి. దీంతో సమస్య మళ్ళి మొదటికొచ్చింది. ఆ ప్రాంతంలో పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో ఎవరూ రాళ్ళను తొలగించేందుకు సాహసం చేయడం లేదు. దీంతో పాడేరు ఘాట్ రోడ్ లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాన్ అయింది.
Read also: Mamata: ప్రధాని మోదీకి నేనంటే అసూయ.. అందుకే ఆహ్వానం వచ్చినా ఇటలీ పర్యటన అడ్డుకుంటున్నారు: మమత