
ప్రేమకు వయస్సు, మత, కుల తారతమ్యాలు అసలు లేవని అంటూ ఉంటారు. ఎప్పుడు ఎక్కడైనా ఎవరి మీద అయినా లవ్ పుట్టొచ్చు. ఇక ప్రేమకు దేశాలు, సరిహద్దులు అనే బేధం లేదు. ప్రేమకు ఇవేమి అడ్డురావాంటుంది నేటి తరం. ఎస్.. తాజాగా ఇది నిజమేనని మరోసారి నిరూపించింది ఓ జంట. సప్త సముద్రాల అవతల పుట్టిన ఓ యువతి.. మన విశాఖ కుర్రోడితో ప్రేమలో పడింది. గత కొంతకాలంగా పాటు వీరి ప్రేమ కొనసాగగ్గా.. చివరికి పీటల వరకు చేరుకుంది. త్వరలో పెళ్లి పీటలెక్కి ఇద్దరూ ఒక్కటి కానున్నారు. తాజాగా వీరి ఎంగేజ్‌మెంట్ అత్యంత గ్రాండ్‌గా జరిగింది. బంధుమిత్రుల మధ్య గ్రాండ్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు. పెద్దల మనసు దోచుకుని కుర్రాడిని జీవిత భాగస్వామిగా చేసుకునేందుకు విదేశీ మహిళ సిద్ధమైంది. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం.
తెలుగు రాష్ట్రాల నుంచి విద్య, ఉద్యోగ రీత్యా చాలామంది విదేశాలకు వెళ్తూ ఉంటారు. కొంతమంది అక్కడే కుటుంబంతో పాటు శాశ్వతంగా స్ధిరపడిపోతారు. అలా విదేశాలకు వెళ్లి అక్కడే తమకు నచ్చిన వారితో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటున్న సంఘటనలు మనం చూస్తున్నాం. విదేశీ అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. తాజాగా విశాఖపట్నంకు చెందిన సైమన్ ప్రేమ కథ కూడా అలాంటిదే అని చెప్పవచ్చు. వైజాజ్‌కు చెందిన అతడు ఉపాధి కోసం గతంలో నార్వే వెళ్ళాడు. 2016 నుంచి ఆ దేశంలోనే ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడు ఉద్యోగం చేసే ప్రాంతంలో రెండేళ్ల క్రితం మ్యూజిక్ క్విజ్‌లో తూరా అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆమె స్పీచ్ థెరపిస్ట్‌గా పని చేస్తొంది. ఇద్దరి మనసులు కలిసాయి. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. రెండేళ్ల పాటు ఇద్దరూ డేటింగ్ చేశారు. ఆ తరువాత ఇద్దరు పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు.
ఇరువురు పెద్దలను ఒప్పంచి పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. దీంతో తమ ప్రేమ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇరు కుటుంబాలవాళ్లు కూడా సానుకూలంగా స్పందించండంతో.. ఇక నిశ్చితార్ధానికి ఫిక్స్ అయ్యారు. వధువు పేరేంట్స్ నార్వే నుంచి విశాఖ వచ్చారు. భారతీయుల్లో కనిపించే ప్రేమ, ఆప్యాయతలు వధువు కుటుంబసభ్యులు ఫిదా అయ్యారు. అత్యంత ఘనంగా వీరి నిశ్చితార్ధ వేడుక విశాఖలో జరిగింది. ఇరు కుటుంబాలతోపాటు బంధువులు స్నేహితులు కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. తన కోడలిని భారతీయ సంప్రదాయ వస్త్రధారణలో చూడాలన్న ఆశతో తొలి బహుమతిగా చీరను అందించారు వరుడి తండ్రి జ్ఞాన్ ప్రకాష్.