వైజాగ్‌లో డ్రగ్స్ దందా.. 10 రోజుల్లో 3 చోట్ల వెలుగు చూసిన మత్తు ఇంజక్షన్లు.. యువత ఫ్యూచర్‌పై భారీ ఎఫెక్ట్..

|

Jan 27, 2023 | 9:22 PM

Visakhapatnam: విశాఖకు సూది దిగింది. మత్తులో మునిగి తేలుతోంది. గమ్మత్తుగా గంతులేస్తోంది. మత్తు కావాలా నాయనా? చలో పూర్ణా మార్కెట్‌. కాంటాక్ట్‌ మత్తు మహేష్‌. ఆడు కాపోతే ఇంకోడు. గల్లీగల్లీకో ఇంజెక్షన్‌ దందా నడుస్తోంది. సాగర నగరంపై మత్తు మాఫియా గమ్మత్తు వల విసిరేసింది. ఉడ్తా వైజాగ్‌గా మారిపోతోంది ఉక్కు నగరం.

వైజాగ్‌లో డ్రగ్స్ దందా.. 10 రోజుల్లో 3 చోట్ల వెలుగు చూసిన మత్తు ఇంజక్షన్లు.. యువత ఫ్యూచర్‌పై భారీ ఎఫెక్ట్..
Drugs In Vizag
Follow us on

ఉడ్తా వైజాగ్..! ప్రశాంతతకు మారుపేరైన విశాఖ నగరం.. మత్తుకు కేరాఫ్ అవుతోందా.. మత్తుమాఫియా చేతుల్లో వెళ్ళిపోతోందా…? నార్కోటిక్స్ డ్రగ్స్, మత్తు ఇంజక్షన్లు- టాబ్లెట్ల వినియోగం ఆ రేంజ్‌లో ఉందిక్కడ. గతేడాది 252 కేసుల్లో 598 మంది అరెస్టయితే.. ఈ ఏడాది అంతకుమించి అన్నట్టుంది సిట్యువేషన్. 10 రోజుల గ్యాప్‌లో మూడు చోట్ల మత్తు ఇంజక్షన్లు పట్టుపడ్డాయ్. విద్యార్థులే టార్గెట్‌గా తెగబడుతున్నాయ్ మత్తుముఠాలు. ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ నుంచి దిగుమతవుతున్న మత్తు టాబ్లెట్లు, డ్రగ్స్ ఇక్కడి యువతను చిత్తు చేస్తున్నాయి. మొన్న యాదవ జగ్గరాజుపేటలో మత్తు ముఠా ఆట కట్టించింది SEB.

తాజాగా జలారిపేటలో 495 మత్తు ఇంజక్షన్లు దొరికాయి. చిత్తు కాగితాలు, చెత్త వ్యాపారం మాటున సాగిన దువ్వాడ రైల్వే స్టేషన్, తుంగ్లంకు వెళ్లే ప్రధాన రహదారిలో జరిగిన మత్తు దందాను మర్చిపోకముందే.. ఓపెన్‌ మార్కెట్లో ఇలా నడిరోడ్డుపైనే మత్తు ఇంజక్షన్లు అమ్ముడవడం షాకిస్తోంది.

NAD జంక్షన్ దగ్గర రెడ్ హ్యాండెడ్‌గా 94 మత్తు ఇంజక్షన్లు SEB అధికారులకు దొరికాయి. విజయనగరం జిల్లా దేశపాత్రునిపాలెంకు చెందిన చందు, పెందుర్తికి చెందిన కళ్యాణ్ సాయి, భీమిలికి చెందిన రాఘవరావు అరెస్టయ్యారు. ఇప్పుడు జాలారిపేటలో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన 490 పెంటా జోసైన్ లాక్టేట్ ఇంజక్షన్లను సీజ్ చేశారు. కీలక నిందితుడు పూర్ణ మార్కెట్ మహేష్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇలా మూడు ఇంజక్షన్లు, ఆరు సిరంజిలుగా సాగిపోతోంది మత్తు దందా.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ, వెస్ట్ బెంగాల్‌లో ఒక్కో ఇంజక్షన్ ధర 30 రూపాయలు. అక్కడ కొనుగోలు చేసి విశాఖలో విద్యార్థులకు 300 రూపాయలకు అమ్ముకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని వాట్సాప్ గ్రూపులు, కోడ్ లాంగ్వేజ్ కూడా ఉన్నాయంటూ ఆయన చెప్పుకొచ్చారు.

‘ఒకవైపు మత్తు ఇంజక్షన్ల కలకలం రేగితే.. గంటల వ్యవధిలోనే వన్ టౌన్లో నల్ల మందు పోలీసుల్ని పరుగులు పెట్టించింది. కంచర వీధిలో టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో కిలో నల్లమందును సీజ్ చేశారు. ఈ నల్లమందు ఒరిజినల్ కేరాఫ్ చత్తీస్‌ఘడ్. అక్కడినుంచి దిగుమతై కిలో నాలుగు లక్షలకు హైదరాబాద్‌లో అమ్మేలా ప్లాన్ జరిగిందని’ జగ్గరాజుపేట గ్రామస్తులు తెలిపారు.

మరోవైపు డాక్టర్ పివి సుధాకర్ మాట్లాడుతూ.. మత్తు జోలికి వెళ్లకుండా యువతను ఆదుకునే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మత్తుకి బానిసైన యువత నేరగాళ్లుగా కూడా మారి ఇళ్లల్లోనూ దాడులు చేసే పరిస్థితి వస్తుదనేది నిపుణులు చేస్తున్న హెచ్చరికని గుర్తు చేశారు

డ్రగ్స్ కేసుల్లో.. మూలాలపై కూపీ తాగుతున్నారు విశాఖ పోలీసులు. అంతరాష్ట్ర పోలీసుల కోఆపరేషన్‌తో డ్రగ్స్ మాఫియాపై యుద్ధం ప్రకటించామంటున్నారు. మరి.. ఈ యుద్ధం ఎంతవరకు విజయవంతం అవుతుంది. ఉడ్‌తా వైజాగ్ అనే మత్తు మచ్చ నుంచి విశాఖ నగరం ఎప్పటికి బైటపడుతుందో చూడాలి మరి.