విషాదం.. 59ఏళ్ల కరోనా బాధితురాలు ఆత్మహత్య

| Edited By:

Sep 05, 2020 | 2:41 PM

కడప జిల్లాలో విషాదఘటన జరిగింది. వీరబల్లి మండటంలోని వంగిమళ్ల గ్రామం ఉప్పరపల్లెకు చెందిన ఓ కరోనా బాధితురాలు(59) ఆత్మహత్య చేసుకొంది.

విషాదం.. 59ఏళ్ల కరోనా బాధితురాలు ఆత్మహత్య
Follow us on

Kadapa Patient Suicide: కడప జిల్లాలో విషాదఘటన జరిగింది. వీరబల్లి మండటంలోని వంగిమళ్ల గ్రామం ఉప్పరపల్లెకు చెందిన ఓ కరోనా బాధితురాలు(59) ఆత్మహత్య చేసుకొంది. మనస్తాపంతోనే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే.. మూడు రోజుల క్రితం జరిపిన కరోనా పరీక్షల్లో ఆమెకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే ఉండి, ఆమె వైద్య సేవలు పొందుతుంది. కాగా ఇవాళ గ్రామం శివారులోని మామిడి తోటకు వెళ్లి, ఆమె అక్కడ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న మండల అధికారులు.. ఘటనా స్థలానికి చేరుకొని సంఘటనపై ఆరా తీశారు. ఇక అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే కరోనా సోకిన వారి పట్ల వివక్ష చూపకండి అంటూ ప్రభుత్వాలు అవగాహన ప్రచారాలను చేస్తున్నాయి. అయినా కొందరి తీరు మారడం లేదు. కరోనా సోకిన వారిపై వివక్షను చూపుతున్నారు. దీంతో పలుచోట్ల మనస్తాపానికి గురైన రోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు.

Read More:

ఈ పిల్ల ఏనుగు మొహంలో సంతోషం చూశారా!

అమరావతిలో మాయమైన ఐదు విగ్రహాలు