ఈ పిల్ల ఏనుగు మొహంలో సంతోషం చూశారా!

పిల్లలంటే పిల్లలే. అది మనుషుల పిల్లలైనా సరే, జంతువుల పిల్లలైనా సరే.. పిల్లల అల్లరికి అంతు ఉండదు. ఇక వారు ఆడుకునేందుకు ప్రత్యేకంగా ఆటవస్తువులు ఉండాల్సిన అవసరం లేదు

ఈ పిల్ల ఏనుగు మొహంలో సంతోషం చూశారా!
Follow us

| Edited By:

Updated on: Sep 05, 2020 | 2:27 PM

Baby Elephant Video: పిల్లలంటే పిల్లలే. అది మనుషుల పిల్లలైనా సరే, జంతువుల పిల్లలైనా సరే.. పిల్లల అల్లరికి అంతు ఉండదు. ఇక వారు ఆడుకునేందుకు ప్రత్యేకంగా ఆటవస్తువులు ఉండాల్సిన అవసరం లేదు. దగ్గర్లో ఏం ఉంటే దాంతో ఆడుకునేందుకు వారు ప్రయత్నిస్తుంటారు. అలా ఇసుకలో ఓ ఏనుగు పిల్ల ఆడుకుంటోన్న వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నంద తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

16 సెకన్ల పాటు ఉంటే ఈ వీడియోలో ఇసుకలో ఆ ఏనుగు పిల్ల ఆడుకుంటూ ఉంది. తన కాళ్లతో ఇసుకను తొక్కుతూ సంతోషపడుతోంది. ఇక ఈ వీడియోకు సుశాంత నంద.. ఎవరెస్ట్ పర్వతం ఎక్కిన దాని కంటే ఎక్కువ సంతోషం ఈ పిల్ల ఏనుగులో కనిపిస్తోంది అంటూ కామెంట్ పెట్టారు. ఇక ఈ వీడియోకు నెటిజన్లు కూడా వావ్‌, సూపర్‌, సో క్యూట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read More:

అమరావతిలో మాయమైన ఐదు విగ్రహాలు

హైదరాబాద్‌లో మొదలైన మెట్రో ట్రయల్ రన్‌