గుర్తు కొస్తున్నాయి… సంతోష్ బాబు చదివింది ఇక్కడే…

|

Jun 17, 2020 | 4:05 PM

కోరుకొండ స్కూల్లో చదువుకునే ముందు సంతోష్‌బాబు తమ ప్రాథమిక అభ్యాసాన్ని మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట శ్రీ సరస్వతి శిశుమందిర్‌లో పూర్తిచేశాడు.

గుర్తు కొస్తున్నాయి... సంతోష్ బాబు చదివింది ఇక్కడే...
Follow us on

కోరుకొండ స్కూల్లో చదువుకునే ముందు సంతోష్‌బాబు తమ ప్రాథమిక అభ్యాసాన్ని మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట శ్రీ సరస్వతి శిశుమందిర్‌లో పూర్తిచేశాడు. అతనికి చదువు నేర్పిన తొలి గురువు రావుల‌ రామన్న..  సంతోష్‌బాబు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. 4వ తరగతి వరకు తమ వద్ద చదువుకున్నట్టు చెప్పారు. అతనికి విద్యాబుద్దులు నేర్పే అవకాశం తమకు రావడం గురువుగా ఆనందంగా ఉందని ఆనాటి జ్ఞాపకాలను రావుల‌ రామన్న గుర్తుచేసుకున్నారు. విషయం తెలుసుకున్న అతని చిన్ననాటి మిత్రులు స్కూల్‌కు చేరుకున్నారు.  కల్నల్‌ సంతోష్‌బాబు వీరమరణంపై ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మన మాతృభూమి కోసం తమ విలువైన ప్రాణాలను త్యాగం చేసిన త్యాగధనులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని శ్రీ సరస్వతి శిశుమందిర్‌ పూర్వ విద్యార్ధి పరిషత్ సభ్యులు అన్నారు ‌.