రేపు నర్సాపూర్ కు సీఎం కేసీఆర్..ఆరో విడత హరిహారానికి శ్రీకారం

| Edited By: Pardhasaradhi Peri

Jun 24, 2020 | 4:56 PM

తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేపడుతున్న హ‌రిత‌హారం ఆరో విడత కార్య‌క్ర‌మానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. మెద‌క్ జిల్లా న‌ర్సాపూర్ లో మొక్కలు నాటి హరిహారం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. గురువారం ఉదయం 11గంటలకు స్థానిక అర్బన్‌ పార్కులో సీఎం మొక్క నాటుతారని ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్‌రావు తెలిపారు.

రేపు నర్సాపూర్ కు సీఎం కేసీఆర్..ఆరో విడత హరిహారానికి శ్రీకారం
Follow us on

తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేపడుతున్న హ‌రిత‌హారం ఆరో విడత కార్య‌క్ర‌మానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. మెద‌క్ జిల్లా న‌ర్సాపూర్ లో మొక్కలు నాటి హరిహారం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. గురువారం ఉదయం 11గంటలకు స్థానిక అర్బన్‌ పార్కులో సీఎం మొక్క నాటుతారని ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్‌రావు తెలిపారు. అర్బన్‌ పార్కులో నిర్మించిన ప్రధానగేటు, బ్రిడ్జి, ఔషధ మొక్కలు, వాచ్‌టవర్‌ను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, పీసీసీఎఫ్‌ శోభ, కలెక్టర్‌ ధర్మారెడ్డితో కలిసి మంగళవారం పరిశీలించారు.

ఇక ప్రభుత్వం ఆరో విడత హరిత హారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 30 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. జంగల్‌ బచావో.. జంగల్‌ బడావో అని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన నినాదస్ఫూర్తితో అందరూ హరితహారంలో మమేకం కావాలని కోరారు. ఈ విషయమై ప్రజాప్రతినిధులకు మంగళవారం లేఖ రాశారు. ఐదు విడుతల్లో 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ఆరో విడుత తెలంగాణకు హరితహారాన్ని విజయవంతం చేయాలంటూ సహచర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను కోరారు.

రాష్ర్టంలోని అన్ని జాతీయ‌, రాష్ర్ట ర‌హ‌దారుల వెంబడి నిరంతరాయంగా చెట్ల పెంప‌కం చేపట్టాలని ముఖ్య‌మంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. ర‌హ‌దారుల వెంట ప్ర‌తి 30 కిలోమీట‌ర్ల దూరానికి ఒక న‌ర్స‌రీని ఏర్పాటు చేయాల‌ని సీఎం అధికారులకు సూచించారు. అలాగే ఈసారి హెచ్ఎండీఏ పరిధిలో 5 కోట్ల మొక్కలు.. జీహెచ్ఎంసీ పరిధిలో 2.5 కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించింది. దీని కోసం ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను చేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని హరితహారం కోసం 12,500 నర్సరీల్లో మొక్కలు రెడీగా ఉన్నాయి. ప్రతి ఇంటికి ఆరు మొక్కలను ఉచితంగా అందిచనున్నారు.