తిరుమల కొండల్లో క్రూరమృగాల సంచారం, శ్రీవారి భక్తులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. తాజాగా మొదటి ఘాట్ రోడ్డులో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. గోడపై కూర్చొన్న చిరుతను చూసిన నడకదారి భక్తులు, వాహనదారులు హడలెత్తిపోయారు. వెంటనే టీటీడీ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు.. సైరన్ మోగించడంతో చిరుత అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. నడకదారి మార్గంలో భక్తులు గుంపులుగా వెళ్లాలని, చిరుత జాడ గమనించిన వెంటనే తెలియజేయాలని టీటీడీ కోరుతోంది.