Vizag: విశాఖ ఎంపీ స్థానానికి వైసీపీ తరఫున అనుకోని అభ్యర్థి.. గట్టిగానే ప్లాన్ చేశారుగా

|

Jan 07, 2024 | 6:42 PM

ఏపీలో అధికార వైసీపీ దూకుడు పెంచింది. అసెంబ్లీ, పార్లమెంట్‌ సెగ్మెంట్లలో పలువురు అభ్యర్థులను మార్చిన వైసీపీ తాజాగా విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ పేరును దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అటు అరకు, ఎస్‌.కోటలో అసంతృప్త నేతలతో వైవీ సుబ్బారెడ్డి భేటీ అయ్యారు.

Vizag: విశాఖ ఎంపీ స్థానానికి వైసీపీ తరఫున అనుకోని అభ్యర్థి.. గట్టిగానే ప్లాన్ చేశారుగా
Vizag
Follow us on

ఏపీలో ఎన్నికల టైమ్‌ దగ్గపడుతోంది. అన్ని పార్టీల కంటే ముందుగా అధికార వైసీపీ అభ్యర్థుల ఎంపికలో కసరత్తు మొదలుపెట్టింది. పలు అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చేసింది. తాజాగా విశాఖ లోక్‌సభ స్థానానికి బొత్స ఝాన్సీని రంగంలోకి దించాలని భావిస్తోంది. ఆమె పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విశాఖ ఎంపీగా ఉన్న MVV సత్యనారాయణ ఈస్ట్‌ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తుండటంతో కొత్త అభ్యర్థి కోసం విసృత కసరత్తు చేసి చివరకు బొత్స ఝాన్సీని నిలబెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. బొత్స ఝాన్సీ ఉత్తరాంధ్రకు చెందిన ప్రధాన వెనకబడిన కాపు సామాజికవర్గం, ప్రముఖ రాజకీయ కుటుంబం కావడం సానుకూల అంశాలుగా వైసీపీ అధిష్ఠానం భావిస్తోంది. గతంలో జెడ్పీ చైర్మన్‌, రెండు సార్లు లోక్‌సభ ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. ఝాన్సీ పోటీ ప్రభావం మొత్తం ఉత్తరాంధ్ర అంతటా ఉంటుందని అధికారపార్టీ భావిస్తోంది. బొత్స ఝాన్సీ విశాఖ ఎంపీగా పోటీ చేసే అంశంపై పార్టీలో ఎలాంటి చర్చ జరగలేదన్నారు. పార్టీ ఆదేశిస్తే ఎక్కడైనా పోటీ చేస్తామన్నారు.

Botsa Jhansi

మరోవైపు ఉమ్మడి విశాఖ జిల్లాలో YCP అభ్యర్థుల మార్పులు, చేర్పులతో కొంతమంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శృంగవరపు కోట MLA శ్రీనివాస్‌పై..స్థానిక ప్రజాప్రతినిధులు వైవీ సుబ్బారెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలతో కుమ్మకైనా ఎమ్మెల్యే శ్రీనివాస్‌కు టిక్కెట్‌ ఇవ్వొద్దని కోరారు. అటు అరకు అసెంబ్లీ ఇన్‌చార్జ్‌గా గొడ్డేటి మాధవిని అధిష్ఠానం ఖరారు చేయడంపై స్థానిక నేతలు మండిపడుతున్నారు. విశాఖలో వైవీ సుబ్బారెడ్డిని కలిసిన అరకు నేతలు..మాధవికి కాకుండా స్థానికులకే టిక్కెట్ ఇవ్వాలని కోరారు.

ఉత్తరాంధ్రలోని వైసీపీలో ఎలాంటి గొడవలు లేవని..చిన్న చిన్న అభిప్రాయభేదాలు మాత్రమే ఉన్నాయన్నారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. మొత్తానికి ఉత్తరాంధ్రలో వైసీపీ చేస్తున్న కసరత్తు..రానున్న ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..