
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతామని బీజేపీ నేత పురంధేశ్వరి అన్నారు. ఆమె విశాఖలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రంలో చర్చిస్తామని, ప్రైవేటీకరణను అపుతామని అన్నారు. విశాఖతో మాకు ఎంతో అనుబంధం ఉందని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపే ప్రయత్నం చేస్తాం.. కానీ నిర్ణయం మాత్రం ప్రభుత్వం చేతిలో ఉందని పేర్కొన్నారు. మా రాష్ట్ర కమిటీ అదే పనిలో ఉందన్నారు. స్టీల్ ప్లాంట్ ఉండాలన్నదే మా భావన అని అన్నారు.
ఎన్నో రకాలుగా ఆలోచించి కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని, మద్దతు ధరకు ఎప్పుడు చట్టబద్దత లేదన్నారు. రాజకీయ లబ్దికోసం బీజేపీ పని చేయదని, ప్రజల మేలు కోసమే పని చేస్తుందని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం మా ప్రయత్నం మేం చేస్తామని, ప్రజల అభిప్రాయాన్ని పార్టీ పెద్దలకు తెలియజేస్తామని అన్నారు. ఏపీకి కొత్తగా 16 రైల్వేలైన్‌లు కేటాయించారని, ఏపీ ఆర్థిక లోటు కోసం రూ.30 వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కరోనాతో నష్టపోయిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రయత్నిస్తోందన్నారు.
Also Read: MP Gorantla Madhav: ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ గోరంట్ల మాధవ్