విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ తప్పదా..? నిజంగానే తీర్చలేనంత అప్పుల్లో కూరుకుపోయిందా..? కేంద్రం ప్లాన్‌ ఏంటి..?

Vizag Steel Plant:విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ తప్పదా... నిజంగానే తీర్చలేనంత అప్పుల్లో స్టీల్ ప్లాంట్‌ కూరుకుపోయి ఉందా..? ఈ నష్టాలకు కారణమేంటి..

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ తప్పదా..? నిజంగానే తీర్చలేనంత అప్పుల్లో కూరుకుపోయిందా..? కేంద్రం ప్లాన్‌ ఏంటి..?
Follow us

|

Updated on: Feb 08, 2021 | 11:50 AM

Vizag Steel Plant:విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ తప్పదా… నిజంగానే తీర్చలేనంత అప్పుల్లో స్టీల్ ప్లాంట్‌ కూరుకుపోయి ఉందా..? ఈ నష్టాలకు కారణమేంటి.. ఆస్తుల కంటే అప్పులే ఎక్కువ ఉన్నాయా… కావాలనే ప్రైవేటీకరణ జపం కేంద్రం చేస్తుందా..? ఇప్పుడు ఇవి మిలియన్ డాలర్ల ప్రశ్నలు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌ ఒక్కసారి భగ్గుమంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు, విమర్శలు ప్రతివిమర్శలు, రాజీనామాలతో ఉక్కు నినాదం ఉవ్వెత్తున ఎగసి పడింది. ఎవరు ఎలా స్పందిస్తున్నా… కేంద్రం మాత్రం వెనక్కి తగ్గేది లేదంటూ చర్యలు ప్రారంభించేందుకు సిద్దమవుతోంది. ఏడాదిన్నరలోనే ప్రక్రియ పూర్తి చేయాలన్న స్పీడ్‌గా పని చేస్తున్నట్టు సమాచారం.

విశాఖ ఉక్కు ఎప్పుడు ప్రారంభమైంది..?

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రస్థానం 1963లోప్రారంభమైంది. విశాఖ బెస్ట్‌ ప్లేస్‌ అని నిపుణులు కమిటీ రిపోర్ట్‌ ఇచ్చింది. ఆర్థిక కారణాల సాకుతో ఎళ్లు గడిచినా ఆ ఫైల్‌ ముందుకు కదల్లేదు. పరిశ్రమను వేరే ప్రాంతానికి తరలిపోతుందన్న అనుమానంతో 1965లో అమృతరావు దీక్ష స్టార్ట్ చేశారు. ఒక్కడితో ప్రారంభమైన ఉద్యమం ఏడాదిలోనే రాష్ట్రమంతటా విస్తరించింది. విశాఖ ఉక్కు.. అంధ్రుల హక్కు నినాదంతో మారుమోగిపోయింది. తర్వాత జరిగిన కాల్పులు, హింసాత్మక సంఘటనల్లో 32మంది అమరులయ్యారు. దీంతో ఇందిరా గాంధీ ప్రభుత్వం మెట్టు దిగొచ్చి పరిశ్రమ ఏర్పాటుకు నవంబర్‌ 3 ప్రకటన చేశారు. 1971 జనవరి 20న శంకుస్థాపన జరిగింది. 64గ్రామాల పరిధిలో 22వేల ఎకరాలు సేకరించారు. 1992లో పీవీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది.

నవరత్నంగా ఎదిగిన విశాఖ స్టీల్‌ కంపెనీలో 17500 వేల మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారు. మరో 20వేల మంది అవుట్‌సోర్సింగ్‌ ద్వారా ఉపాధి పొందుతున్నారు. దీనికి అనుబంధంగా 5కుపైగా కంపెనీలు ఉన్నాయి. 2003-04లోనే నష్టాల పేరుతో మూసివేత ప్రయత్నాలు జరిగాయి. కానీ కార్మికులు తిరుగుబాటు చేశారు. లాభాల్లోకి తీసుకొస్తామని కేంద్రానికి హామీ టార్గెట్‌ రీచ్‌ అయ్యారు. తర్వాతే దీన్న నవరత్న హోదా కూడా సంపాదించి పెట్టారు.

ఇంత వరకు స్టీల్ ప్లాంట్ స్టోరీ బాగానే ఉంది. 2010 తర్వాత కథ అడ్డం తిరిగింది. వాజ్‌పేయి విధానాలతో అప్పులు తీర్చుకున్న కంపెనీ… లాభాల బాట పట్టింది. 2011-12 నాటికి కంపెనీ అప్పులు జీరోకు చేరాయి. అప్పడు చేపట్టిన విస్తరణ పనులు స్టీల్ ప్లాంట్‌ ఫేట్‌ను మార్చేశాయి. విస్తరణ కోసం ఖర్చు చేసిన 22500 కోట్లను కేంద్రం చెల్లించలేదు. దీంతో వచ్చిన లాభాలన్నింటినీ వడ్డీలకే చెల్లిస్తూ వచ్చింది ఉక్కు పరిశ్రమ. ఆరేళ్లుగా ఈ వడ్డీలు చెల్లిస్తూ వస్తోంది. ఇక్కడే స్టీల్‌ప్లాంట్‌కు పెద్ద దెబ్బ తగిలింది.

విస్తరణ ఖర్చు తిరిగి చెల్లించలేక ఇబ్బంది పడుతున్న స్టీల్‌ప్లాంట్‌ను ముడిసరకు వ్యయం దెబ్బమీద దెబ్బ తీసింది. 65 శాతం నిధులు దీని కోసమే ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒకవేల ప్రత్యేకంగా స్టీల్‌ప్లాంట్‌కు గనులు కేటాయిస్తే 50శాతం నిధులు ఆదా అవుతుందని అది లాభాల్లోకి వస్తాయంటోంది యాజమాన్యం. క్యాప్టివ్‌మైన్స్‌ ఉంటే ముడిసరకు టన్ను 1500 కే వస్తుంది. ఆ వెసులుబాటు లేనందున టన్ను 7000లకు కొంటోంది విశాఖ స్టీల్స్. ఇలాంటి చిన్న చిన్న ఇష్యూలే విశాఖ స్టీల్‌ప్లాంట్ భవితవ్యాన్ని ప్రశ్నార్థం చేశాయి. 2010 నాటికి లాస్‌మేకింగ్ పబ్లిక్‌ సెక్టార్‌ యూనిట్‌గా గుర్తింపు పొందిన స్టీల్ ప్లాంట్‌… ఐదేళ్లల్లోనే కోలుకోలేని నష్టాల్లోకి జారిపోయింది. 2017-18లో 1369 కోట్లు… 2019-20లో 3910 కోట్లు నష్టాలు మూటగట్టుకుంది.

ప్రస్తుతం 3910 కోట్ల నష్టాల్లో నడుస్తున్న స్టీల్‌ ప్లాంట్‌కు ఆస్తులే లేవా అంటే… ప్రాఫిట్స్‌బాగానే ఉన్నాయి. 14వేల ఎకరాల్లో టౌన్‌షిప్‌, గ్రీన్ బెల్ట్‌ ఉన్నాయి. ఎకరం భూమి 5 కోట్లు వేసినా లక్ష కోట్లకు ఏమాత్రం తగ్గదు. మొత్తం పరిశ్రమ ఆస్తులు 2 లక్షలు కోట్లు ఉంటుందని ఓ అంచనా. ఇన్ని ఆస్తులు ఉన్న సంస్థలకు ఇప్పుడున్న నష్టాలు పూడ్చుకోవడం పెద్ద కష్టమా అనే ప్రశ్న ఎదురవుతోంది. ఏడాదికి 210 లక్షల టన్నుల స్టీల్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం విశాఖ స్టీల్స్‌కు ఉంది. ఇప్పుడు అందులో సగం కూడా చేయడం లేదు. ఇది కూడా కంపెనీ నష్టాలకు కొంత కారణమవుతోంది.

– 1963లోప్రారంభమైన విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రస్థానం – 1965లో దీక్ష స్టార్ట్ చేసిన అమృతరావు- ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమం – 1970 నవంబర్‌ 3న విశాఖ ఉక్కుపై ప్రకటన చేసిన కేంద్రం – 1971 జనవరి 20న శంకుస్థాపన- 1992లో పీవీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం – 2003-04లోనే నష్టాల పేరుతో మూసివేత ప్రయత్నాలు – లాభాల్లోకి తీసుకొస్తామన్న యాజమాన్యం హామీతో ఆగిన ప్రయత్నాలు – 2010 తర్వాత మరిన విశాఖ స్టీల్ ప్లాంట్ కథ – 2011-12 నాటికి కంపెనీ అప్పులు జీరో – విస్తరణ పనులతో మెల్లగా నష్టాల్లోకి జారుకున్న స్టీల్ ప్లాంట్‌ – విస్తరణకు ఖర్చు చేసిన రూ. 22500 కోట్లు చెల్లించని కేంద్రం – ఏళ్లతరబడి వడ్డీలు కడుతూ లాక్కొస్తున్న స్టీల్ ప్లాంట్ – క్యాప్టివ్‌మైన్స్‌ ఉంటే ముడిసరకు టన్ను 1500 కే వచ్చే ఛాన్స్ – ప్రస్తుతం ముడి సరుకు టన్ను రూ. 7000కు కొంటున్న విశాఖ స్టీల్స్

దీన్ని ఎందుకు పెంచడం లేదన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రస్తుతం 73లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యానికి పెరిగింది. కంపెనీపై చేసిన వ్యయం రూ.30వేల కోట్లు, 14వేల ఎకరాల్లో టౌన్‌షిప్‌, గ్రీన్‌ బెల్ట్‌, ఎకరం భూమి 5 కోట్లు వేసినా రూ. లక్ష కోట్లు, మొత్తం పరిశ్రమ ఆస్తులు 2లక్షలు కోట్లు అంచనా, అమ్మితే 35వేల కోట్లే వస్తాయంటున్నారు కార్మికులు.

లాభాల్లోఉన్నకంపెనీ నష్టాల్లోకి ఎలా వెళ్లింది.

ఎన్‌ఎండీసీ రేట్లు పెంచడంతో ఐరన్‌ ఓర్‌ కాస్టు పెరిగి.. విశాఖ స్టీల్‌పై భారం పడింది. అప్పటి నుంచే నష్టాల్లోకి వెళ్లడం మొదలైంది. ప్రత్యేక క్యాప్టీవ్ మైన్ ఇవ్వాలి. సెయిల్‌ వాళ్లు గోవాలో వెలికితీసిన ఐరన్ గనుల్లో నుంచి కొంత భాగాన్ని విశాఖకు కేటాయిస్తే చాలు. కాగా, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. ఏడాదిన్నరలోగా ఈ ప్రక్రియ పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ద్వారా లక్షా 75 వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం… ఈ క్రమంలో విశాఖ ఉక్కు విక్రయ వ్యవహారాన్ని వేగంగా కదిపే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఏడాదిన్నరలోగా పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయంతో 1.75లక్షల కోట్లు సమీకరించాలని 2021-2022 బడ్జెట్‌లో లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. 2 బ్యాంకులు, 1 బీమా సంస్థల్లో వాటాల విక్రయించేందుకు నిర్ణయించింది. LICలో IPO ద్వారా షేర్ల విక్రయించేందుకు ప్రయత్నాలు. ఎయిరిండియా సహా RINLలో వందశాతం డిజిన్విస్టిమెంట్‌ చేయాలని డిసైడ్‌ అయిన కేంద్రం… అమ్మకానికి కేబినెట్‌ కమిటీ ఆఫ్‌ ఎకనామిక్‌ ఎఫైర్స్‌ లైన్ క్లియరెన్స్‌ ఇచ్చింది. జనవరి27నే 100 శాతం డిజిన్విస్ట్‌మెంట్‌కు నిర్ణయించింది. దీన్ని సాకారం చేసుకొనేందుకు ‘విశాఖ ఉక్కు’ విక్రయ వ్యవహారాన్ని వేగంగా కదిపే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ ప్రైవేటీకరణ కార్యక్రమం ప్రారంభానికి తొలుత కేంద్ర ప్రభుత్వం లావాదేవీల, న్యాయ సలహాదారులను నియమిస్తుంది. తర్వాత కొనేందుకు ఆసక్తి గలవారిని ఆహ్వానిస్తూ ‘ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌’ పిలుస్తారు. అర్హతలను ముందే నిర్దేశిస్తారు. అనుభవం, నెట్‌వర్త్‌, ఉక్కు తయారీ సామర్థ్యం, దేశీయ భాగస్వామ్యం లాంటి షరతులు పెడతారు. ఇందులో అర్హత సాధించిన వారికి ‘రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌’ బిడ్డింగ్‌కు అనుమతిస్తారు. ఈ ఉక్కు కర్మాగారాన్ని కొనేందుకు ఆర్థిక బిడ్‌ దాఖలుకు ఆ తర్వాత వీలు కల్పిస్తారు. ఎక్కువ మొత్తం కోట్‌ చేసినవారికి కర్మాగారం అప్పగిస్తారు.

బిడ్డింగ్‌ మొత్తాన్ని ఏకమొత్తంలో ప్రభుత్వానికి చెల్లించాలి. అయితే.. సంస్థ విలువలో అప్పులు పోను మిగిలిన మొత్తం ఏకమొత్తంలో చెల్లించి, అప్పులను వాటి కాలపరిమితి ప్రకారం చెల్లించడానికి వీలుంటుంది. ప్రభుత్వం ఇప్పటి వరకూ ఈ సంస్థ విలువను లెక్కించలేదని తెలిసింది. ముందే కొంతమొత్తం అని చెబితే.. బిడ్డర్లు అంతకంటే కొంత ఎక్కువకు బిడ్లు దాఖలు చేయొచ్చని.. అందుకే దాని జోలికి పోలేదని అంటున్నారు. నిజానికి ఉక్కు కర్మాగారాన్ని షేర్‌మార్కెట్లో లిస్టింగ్‌ చేసి 10శాతం వాటాలను ఐపీఓ ద్వారా విక్రయించాలని తొలుత ప్రభుత్వం భావించిందని, కానీ తర్వాత సంస్థ నష్టాల్లో ఉండటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు పేర్కొన్నారు. నష్టాల్లో ఉన్న సంస్థల షేర్ల కొనుగోలుకు ఎవరూ ముందుకు రారన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రైవేటీకరణ వైపు మొగ్గుచూపినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ రంగంలో ఎఫ్‌డీఐలకున్న అనుమతులకు లోబడి విదేశీ సంస్థలకూ అవకాశం ఇస్తారని చెప్పారు. ప్రస్తుతం కర్మాగారానికి ఉన్న మొత్తం భూమిని ఇవ్వరని.. ప్రస్తుత ఉత్పత్తికి, భవిష్యత్తు విస్తరణకు ఎంత కావాలో అంతవరకే ఇస్తారని పేర్కొన్నారు.

ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు ప్రభుత్వం ఉత్సాహంగా ఉన్నా, స్పందన అంతగా రావట్లేదని అధికారులు పేర్కొన్నారు. గతేడాది ప్రైవేటీకరణ ద్వారా రూ.2.10 లక్షల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నా, రూ.30వేల కోట్లే వచ్చాయి. గతేడాది అమ్మకానికి పెట్టిన సంస్థల లాభదాయకత సరిగా లేకపోవడంవల్లే కొనుగోలుదార్ల నుంచి పెద్దగా స్పందన రాలేదన్నారు. విశాఖ ఉక్కుకు మంచి డిమాండు ఉండొచ్చని అంచనావేస్తున్నారు. ఈ కర్మాగారం సముద్రతీరంలో ఉండటం, పక్కనున్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో ఇనుప ఖనిజం అందుబాటులో ఉండటంతో దీనిపై కొనుగోలుదారులు ఆసక్తి చూపొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సెయిల్‌, ఆర్‌ఐఎన్‌ఎల్‌ రెండూ నష్టాల్లోనే ఉన్నాయి. నష్టాల పేరుతో ఆర్‌ఐఎన్‌ఎల్‌ విక్రయానికి సిద్ధమైన కేంద్రప్రభుత్వం.. సెయిల్‌ గురించి ఏమీ చెప్పడంలేదు. సెయిల్‌ తన సొంత గనుల నుంచి తీసిన ఇనుప ఖనిజాన్ని వాడుకోవడంతో పాటు.. అందులో 25 శాతాన్ని రెండేళ్ల పాటు బయట అమ్ముకోడానికీ వీలు కల్పించింది. దీనికితోడు సెయిల్‌ తన గనుల పరిధిలో డంప్‌ చేసిన 7 కోట్ల టన్నుల ఇనుప ఖనిజాన్నీ విక్రయించుకోవడానికి కేంద్రం వెసులుబాటు ఇచ్చింది. అలాంటి సానుకూల అంశాలేవీ విశాఖ ఉక్కు కర్మాగారానికి లేవు

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేక పోరు

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరు తీవ్రమైంది. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ…ఉద్యోగులు, కార్మికులతో పాటు నిర్వాసితులు…భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ కానివ్వబోమని.. ముక్తకంఠంతో నినదించారు. అదే సమయంలో పోరాటానికి మద్దతుగా టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు…ప్రైవేటీకరణ వద్దంటూ ఆన్‌లైన్‌లో సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టారు. ఇక్కడ ఉన్న పరిస్థితిని కేంద్రానికి తెలియజేస్తామంటున్న బీజేపీ నాయకులు. సొంత గని కేటాయించమని ఎన్నో ఏళ్లుగా చేస్తున్న విజ్ఞప్తులను పెడచెవిన పెడుతున్న కేంద్రం..నష్టాలకు స్టీల్‌ప్లాంట్‌ సంస్థను బాధ్యత వహించమనడం ఎంత వరకు సమంజసమని ఉద్యోగులు, కార్మికులు ప్రశ్నించారు. నష్టాలు వస్తున్నాయనే అంశాన్ని కారణంగా చూపి..పరిశ్రమను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసేందుకే కేంద్రం ప్రయత్నం చేస్తుందని ఆరోపించాయి.

Also Read:

ముస్లింగా పుట్టి తత్వవేత్తగా మారిన శ్రీ ఎం.. భారత ప్రభుత్వం చేత మన్ననలను పొందుతున్న యోగా గురువు.. ఇంతకీ ఎవరతను..?

విశాఖ స్టీల్ ప్లాంట్ స్ట్రాటజీ : నిన్నటి వరకూ సైలెంట్‌గా ఉండి, ఉన్నఫళంగా స్పీడు పెంచిన వైసీపీ నేతలు

విశాఖ ఉక్కుపై కేంద్ర నిర్ణయంతో కుదేలైన ఏపీ బీజేపీ నేతలు, ఢిల్లీ పెద్దల మనసు మారుస్తామంటూ నష్ట నివారణ చర్యలు

ఘోర ప్రమాదం.. రోడ్డుపై పల్టీలు కొట్టి చెట్టుపై ఇరుక్కుపోయిన కారు!
ఘోర ప్రమాదం.. రోడ్డుపై పల్టీలు కొట్టి చెట్టుపై ఇరుక్కుపోయిన కారు!
అత్యధిక ఆదాయపు పన్ను ఉన్న దేశాలు ఏవి?
అత్యధిక ఆదాయపు పన్ను ఉన్న దేశాలు ఏవి?
రూ.75 వేలకు చేరువలో బంగారం ధరలు..దిగి రాని వెండి
రూ.75 వేలకు చేరువలో బంగారం ధరలు..దిగి రాని వెండి
12 రాశులకు వార ఫలాలు (ఏప్రిల్ 28 నుంచి మే 4, 2024 వరకు)
12 రాశులకు వార ఫలాలు (ఏప్రిల్ 28 నుంచి మే 4, 2024 వరకు)
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్