విశాఖ జూ కు కొత్త జిరాఫీలు.. ఎక్కడనుంచి వచ్చాయో తెలుసా?

విశాఖలోని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్‎కు కొత్త నేస్తాలు వచ్చాయి. రెండు జిరాఫీలను జూ అధికారులు శనివారం తెచ్చారు. జూ పార్క్‎లో ఇదివరకు ఉన్న రెండు జిరాఫీలు తీవ్ర అనారోగ్యంతో బాధపడి మరణించాయి. దీంతో విశాఖ జూ అధికారులు సెంట్రల్ జూ అథారిటీ, సహకారంతో జంతు మార్పిడి పద్ధతి ద్వారా ఈ కొత్త యువ జీరాఫీలను తెచ్చారు.

విశాఖ జూ కు కొత్త జిరాఫీలు.. ఎక్కడనుంచి వచ్చాయో తెలుసా?
Indira Gandhi Zoo
Follow us

| Edited By: Srikar T

Updated on: Apr 27, 2024 | 8:33 PM

విశాఖలోని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్‎కు కొత్త నేస్తాలు వచ్చాయి. రెండు జిరాఫీలను జూ అధికారులు శనివారం తెచ్చారు. జూ పార్క్‎లో ఇదివరకు ఉన్న రెండు జిరాఫీలు తీవ్ర అనారోగ్యంతో బాధపడి మరణించాయి. దీంతో విశాఖ జూ అధికారులు సెంట్రల్ జూ అథారిటీ, సహకారంతో జంతు మార్పిడి పద్ధతి ద్వారా ఈ కొత్త యువ జీరాఫీలను తెచ్చారు. కోల్‎కత్తాలో ఉన్న అలీపూర్ జూ పార్క్ నుంచి ఒక ఆడ, మగ జిరాఫీలను విశాఖ జూ కి తాజాగా తీసుకు వచ్చారు. ప్రస్తుతం వీటిని జూ క్వారంటైన్లో కొద్ది రోజులు ఉంచి తరువాత సందర్శకులు వీక్షించడానికి అణువుగా ఎన్ క్లోజర్‎ల్లో ప్రవేశపెడతామని జూ అధికారులు తెలిపారు.

జంతు మార్పిడి విధానం ద్వారా పలు వన్య ప్రాణులు..

ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాల, విశాఖపట్నం జూలాజికల్ గార్డెన్, అలీపూర్, కోల్‎కత్తా మధ్య జంతు మార్పిడి విధానంలో కొన్ని జంతువులను తీసుకురావడం జరిగిందని జూ క్యూరేటర్ డా. నందనీ సలారియా తెలిపారు. ఈ ఉదయం అలీపూర్ జూ నుండి విశాఖ జూకి జంతువులను తీసుకువచ్చారు. ఈ జంతు మార్పిడిలో భాగంగా జిరాఫీలు (1:1), ఏషియన్ వాటర్ మానిటర్ లిజర్డ్స్ (2:2), స్కార్లెట్ మకావ్స్ (1:1) అలీపూర్ జూ నుండి వైజాగ్ జూకి తీసుకువచ్చారు.

అదే సమయంలో వైజాగ్ జూ నుంచి తెల్ల పులి (1F), తోడేలు (1:1), ఇండియన్ వైల్డ్ డాగ్స్ (3:2), రింగ్ టెయిల్డ్ లెమర్ (1:1), బ్లాక్ స్వాన్ (1:1), హాగ్ డీర్ (2:2), హైనా (1:1) లను అలీపూర్ జూ కు ఇచ్చినట్టు జూ క్యూరటర్ తెలిపారు. ఈ జంతు మార్పిడి ద్వారా సంరక్షణలో ఉన్న జంతువుల సంక్షేమం, అంతరించిపోతున్న జాతుల సంరక్షణకు దోహదం చేయడమే ముఖ్య లక్ష్యమని క్యూరేటర్ నందనీ టీవీ9 కి తెలిపారు.

ఇవి కూడా చదవండి

ప్రత్యేక వాహనంలో 856 కిలోమీటర్లు..

విశాఖ జూ కు చెందిన వెటర్నరీ బృందం, వైజాగ్ జూ సిబ్బంది కోల్‎కత్తాలోని అలీపూర్ జూ నుండి జిరాఫీలను తీసుకురావడానికి ఏప్రిల్ 22వ తేదీ రాత్రి వైజాగ్ జూ నుండి రోడ్డు మార్గంలో బయలుదేరారు. అలీపూర్ నుండి వైజాగ్ జూకు జిరాఫీని సురక్షితంగా, సాఫీగా తీసుకుని వచ్చేందుకు గానూ ప్లాన్ చేయడానికి NH-16 ను సర్వే చేయడానికి ఒక బృందం రోడ్డు మార్గంలో వెళ్ళింది. అక్కడి నుంచి ఏప్రిల్ 25వ తేదీన డాక్టర్ నవీన్ కుమార్, డాక్టర్ ఫణీంద్ర, డాక్టర్ పురుషోత్తం నేతృత్వంలోని బృందం, ఇతర జూ సిబ్బంది బయలుదేరి సుమారు 856 కిలోమీటర్లు ప్రయాణించి ఈ ఉదయం విశాఖపట్నం జూకి చేరుకున్నారు. మార్గం అంతా వెటర్నరీ టీం, జంతు సంరక్షకులు, జూ. సిబ్బంది అత్యంత జాగ్రత్త వహించి, ఎప్పటికప్పుడు జంతువును తనిఖీ చేస్తూ వైజాగ్ జూకి సురక్షితంగా చేరుకున్నారు. ఈ జంతు మార్పిడి ద్వారా అలీపూర్ జంతు ప్రదర్శనశాల నుండి సుమారు 2 సంవత్సరాల వయస్సు గల ఒక మగ జిరాఫీ, 4 సంవత్సరాల వయస్సు గల ఒక ఆడ జిరాఫీను తీసుకునిరావడం జరిగింది.

విశాఖ జూ కు స్కార్లెట్ మకావ్ అనే కొత్త పక్షి జాతి

ఈ జంతు మార్పిడి ద్వారా ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ యానిమల్ కలెక్షన్‎లో స్కార్లెట్ మకావ్ అనే ఒక కొత్త జాతి చేరింది. స్కార్లెట్ మకావ్ అతిపెద్ద రంగు రంగుల పక్షి జాతికి చెందినది. సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. అలాగే కొన్ని నెలలు క్రితం వరకు జూ లో ఉన్న జిరాఫీలు, వాటర్ మానిటర్ లిజర్డ్స్ కూడా ఈ జంతు మార్పిడిలో విశాఖ జూ కు వచ్చాయి. చాలా పెద్ద జంతువులైన జిరాఫీలను కోల్‎కత్తా నుంచి విశాఖపట్నంకు తీసుకురావడం చాలా సవాలుతో కూడుకున్న పని అని క్యూరేటర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ సీనియర్ అధికారులు అందించిన సూచనలు సహకారానికి పోలీసు శాఖ, NHAI, అలీపూర్ జూ అధికారుల సహాయ సహకారాలకు క్యూరేటర్ డా. నందనీ సలారియా టీవీ9 ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
రోజూ రాత్రి నిద్రకు ముందు కాసిన్ని నీళ్లలో పాదాలు నానబెట్టారంటే..
రోజూ రాత్రి నిద్రకు ముందు కాసిన్ని నీళ్లలో పాదాలు నానబెట్టారంటే..
ఓనర్ తీరుతో మనస్తాపం! లక్నోను వీడి ఆ జట్టులోకి కేఎల్ రాహల్
ఓనర్ తీరుతో మనస్తాపం! లక్నోను వీడి ఆ జట్టులోకి కేఎల్ రాహల్
తండ్రి కన్నుమూసిన 10 రోజులకే పనిలో.. పదేళ్ల పిల్లాడికి హీరో సాయం
తండ్రి కన్నుమూసిన 10 రోజులకే పనిలో.. పదేళ్ల పిల్లాడికి హీరో సాయం
రేపటి ప్రజాస్వామ్యంలో నేటి యువతను భాగస్వామ్యం ఎంత..?
రేపటి ప్రజాస్వామ్యంలో నేటి యువతను భాగస్వామ్యం ఎంత..?
ఖమ్మం లోక్ సభ స్థానం తెలంగాణ హాట్ సీట్‌గా ఎలా మారింది..?
ఖమ్మం లోక్ సభ స్థానం తెలంగాణ హాట్ సీట్‌గా ఎలా మారింది..?
సహజంగా మొటిమల మచ్చలు తొలిగించే ఆయుర్వేద చిట్కాలు
సహజంగా మొటిమల మచ్చలు తొలిగించే ఆయుర్వేద చిట్కాలు
శరీరంలో ఈ పార్ట్‌ మసాజ్‌ చేస్తే చర్మం చందమామలా వెలిగిపోతుందట
శరీరంలో ఈ పార్ట్‌ మసాజ్‌ చేస్తే చర్మం చందమామలా వెలిగిపోతుందట
కిషన్‌రెడ్డితో టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ స్పెషల్ ఇంటర్వ్యూ
కిషన్‌రెడ్డితో టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ స్పెషల్ ఇంటర్వ్యూ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్.! నీ క్రియేటివిటీకి..
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్.! నీ క్రియేటివిటీకి..
ఈ లక్షణాలను అస్సలు లైట్ తీసుకోకండి.. బ్రెయిన్‌ క్యాన్సర్‌ కాబోలు
ఈ లక్షణాలను అస్సలు లైట్ తీసుకోకండి.. బ్రెయిన్‌ క్యాన్సర్‌ కాబోలు
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..
జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..
డబ్బులు కట్టేందుకు బ్యాంక్‌కి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
డబ్బులు కట్టేందుకు బ్యాంక్‌కి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
ఇల్లు అద్దెకు ఇస్తున్నారా ? ఈ డాక్యుమెంట్ లేకపోతే జైలుకు వెళతారు!
ఇల్లు అద్దెకు ఇస్తున్నారా ? ఈ డాక్యుమెంట్ లేకపోతే జైలుకు వెళతారు!
రెండున్నర కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేసి గెలిపిస్తాడట
రెండున్నర కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేసి గెలిపిస్తాడట