AP Rains: మరో 3 రోజులు చల్లదనమే! ఈ ప్రాంతాలకు పిడుగులు పడే అవకాశం.. వెదర్ రిపోర్ట్ ఇదిగో..

ఐఎండీ సూచనల ప్రకారం దక్షిణ కేరళ మీదగా ఆవర్తనం కొనసాగుతుందని.. దీని ప్రభావంతో ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. రాబోవు నాలుగు రోజులపాటు కింది విధంగా వాతావరణం ఉండనున్నట్లు ఎండి కూర్మనాథ్ వివరించారు. దీని ప్రభావంతో..

AP Rains: మరో 3 రోజులు చల్లదనమే! ఈ ప్రాంతాలకు పిడుగులు పడే అవకాశం.. వెదర్ రిపోర్ట్ ఇదిగో..
Rain Alert
Follow us

|

Updated on: May 10, 2024 | 7:23 PM

ఐఎండీ సూచనల ప్రకారం దక్షిణ కేరళ మీదగా ఆవర్తనం కొనసాగుతుందని.. దీని ప్రభావంతో ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. రాబోవు నాలుగు రోజులపాటు కింది విధంగా వాతావరణం ఉండనున్నట్లు ఎండి కూర్మనాథ్ వివరించారు. దీని ప్రభావంతో రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్,గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే కర్నూలు, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఎల్లుండి పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

13 మే, సోమవారం: కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

14 మే, మంగళవారం: పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, కోనసీమ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.

ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల నాటికి కృష్ణాజిల్లా అవనిగడ్డలో 79 మిమీ, గుంటూరు జిల్లా తుళ్లూరులో 69.7మిమీ, కృష్ణాజిల్లా ఉంగుటూరులో 61మిమీ, ఏలూరు జిల్లా ఆగిరిపల్లి లో 60మిమీ, అల్లూరి జిల్లా డుంబ్రిగూడలో 57.5మిమీ, అనకాపల్లి జిల్లా రావికమతంలో 53మిమీ, తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో 52మిమీ, విజయనగరం జిల్లా వేపాడలో 51.5మిమీ, ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో 48మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు. రేపు శ్రీకాకుళం 9, విజయనగరం 14, పార్వతీపురంమన్యం 9 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.

శుక్రవారం తిరుపతి జిల్లా రేణిగుంటలో 40.9 డిగ్రీలు, అనంతపురం జిల్లా తాడిపత్రి, నంద్యాల జిల్లా నందికొట్కూరు,వైయస్ఆర్ జిల్లా చాపాడులో 40.8 డిగ్రీలు, చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురంలో 40.5 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 40.4 డిగ్రీలు, బాపట్ల జిల్లా అద్దంకి, ప్రకాశం జిల్లా మార్కాపురంలో 40.3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ