AP News: మే 1న వృద్ధాప్య పెన్షన్ పంపిణీపై చర్యలు తీసుకోవాలి.. సీఎస్‎కు కూటమి నేతల వినతి..

గుంటూరు జిల్లా అమరావతిలో ఎన్డీఏ కూటమి నేతల బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిశారు. మే 1న వృద్ధాప్య పెన్షన్లన్నీ ఇంటి వద్దనే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ వినతిపత్నాన్ని అందజేశారు. దురుద్దేశ పూర్వక కాలయాపనతో ఏదైనా జరిగితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, సెర్ఫ్ సీఈఓ మురళీధర్ రెడ్డిలదే బాధ్యత అని హెచ్చరించారు.

AP News: మే 1న వృద్ధాప్య పెన్షన్ పంపిణీపై చర్యలు తీసుకోవాలి.. సీఎస్‎కు కూటమి నేతల వినతి..
Nda Leaders
Follow us

|

Updated on: Apr 27, 2024 | 4:56 PM

అమరావతి, ఏప్రియల్ 27: గుంటూరు జిల్లా అమరావతిలో ఎన్డీఏ కూటమి నేతల బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిశారు. మే 1న వృద్ధాప్య పెన్షన్లన్నీ ఇంటి వద్దనే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ వినతిపత్నాన్ని అందజేశారు. దురుద్దేశ పూర్వక కాలయాపనతో ఏదైనా జరిగితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, సెర్ఫ్ సీఈఓ మురళీధర్ రెడ్డిలదే బాధ్యత అని హెచ్చరించారు. దీనిపై దేవినేని ఉమామహేశ్వర రావు స్పందించారు. ఏప్రిల్‎లో వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులకు సంబంధించిన 13వేలకోట్ల రూపాయల బిల్లులను చెల్లించి ప్రభుత్వ ఖజానా ఖాళీచేశారని ఆరోపించారు. ఏప్రిల్ 3 వరకు రాష్ట్రంలోని అన్ని సచివాలయాల వద్ద పెన్షన్ దారులకు అందజేసే డబ్బులు చేరక 33 మంది లబ్ధిదారులు చనిపోయారని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి దురుద్దేశపూర్వకంగా వైసీపీ పార్టీకి లబ్ధి చేయాలని, ఆ పార్టీ నాయకులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. పెన్షన్ పంపిణీ విధానంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు చీఫ్ ఎలక్షన్ కమిషన్‎కు ఏప్రిల్ 24న లేఖ రాశారు. దానిపై 26వ తేదీ రాత్రి చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు వచ్చాయని తెలిపారు. ఉద్దేశపూర్వక కాలయాపన చేయకుండా మే 1న ఇంటి వద్దనే పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఒక్కొ ప్రభుత్వ సచివాలయ ఉద్యోగి 20 మందికి చొప్పున, అలా రాష్ట్రంలోని నాలుగు లక్షల మంది ఉద్యోగులు ప్రతి ఇంటికి వెళ్ళి సులభంగా పెన్షన్ ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. గతంలో లాగా ఎలాంటి ఇబ్బందికర సంఘటనలు పునరావృతం కాకూడదని.. ఏప్రియల్ 30లోగా పెన్షన్ డబ్బులు మ్యాపింగ్ చేసి.. మే 1 ఉదయం 6 గంటలకల్లా ప్రతి ఇంటికి పంపించాలని కోరారు. జిల్లా కలెక్టర్లకు వారికున్న అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకుని సచివాలయ చీఫ్ సెక్రటరీకి చెప్పి డోర్ టు డోర్ పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.