వీధికుక్కల దాడి.. ఓ చిన్నారి పరిస్థితి విషమం

| Edited By:

Feb 15, 2019 | 4:37 PM

వీధికుక్కల దాడికి.. ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లో వెళ్తే.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో మూడేళ్ల పాపపై వీధికుక్కలు దాడి చేశాయి. స్థానిక రాజారామ్ నగర్ కాలనీకి చెందిన అమూల్య ఆరుబయట ఆడుకుంటుండగా వీధికుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దీంతో చిన్నారిని ఆర్మూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా.. చిన్నారి అమూల్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలియపరచగా.. దీంతో అమూల్యాను హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు సూచించారు. […]

వీధికుక్కల దాడి.. ఓ చిన్నారి పరిస్థితి విషమం
Follow us on

వీధికుక్కల దాడికి.. ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లో వెళ్తే.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో మూడేళ్ల పాపపై వీధికుక్కలు దాడి చేశాయి. స్థానిక రాజారామ్ నగర్ కాలనీకి చెందిన అమూల్య ఆరుబయట ఆడుకుంటుండగా వీధికుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దీంతో చిన్నారిని ఆర్మూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా.. చిన్నారి అమూల్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలియపరచగా.. దీంతో అమూల్యాను హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు సూచించారు. వీధికుక్క దాడిలో చిన్నారి చెంప భాగం లోతుగా గాయమైంది.