నవయుగ పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్

| Edited By:

Aug 20, 2019 | 9:31 PM

పోలవరం రివర్స్ టెండరింగ్ అంశంలో నవయుగ కంపెనీ వేసిన ఫిటిషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిసాయి. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి న్యాయస్థానంలో వాదనలు జరిగాయి. నవయుగ కంపెనీ ఎటువంటి నిబంధలు ఉల్లంఘించలేదని ఆ కంపెనీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. హైడల్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి.. సకాలంలో జెన్‌కో స్థలాన్ని చూపించలేదని వివరించారు. ప్రభుత్వం ఎలాంటి కారణం చూపించకుండా ఒప్పందాన్ని.. ఎలా రద్దు చేస్తారని ఆయన న్యాయస్ధానాన్ని […]

నవయుగ పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్
Follow us on

పోలవరం రివర్స్ టెండరింగ్ అంశంలో నవయుగ కంపెనీ వేసిన ఫిటిషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిసాయి. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి న్యాయస్థానంలో వాదనలు జరిగాయి. నవయుగ కంపెనీ ఎటువంటి నిబంధలు ఉల్లంఘించలేదని ఆ కంపెనీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. హైడల్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి.. సకాలంలో జెన్‌కో స్థలాన్ని చూపించలేదని వివరించారు. ప్రభుత్వం ఎలాంటి కారణం చూపించకుండా ఒప్పందాన్ని.. ఎలా రద్దు చేస్తారని ఆయన న్యాయస్ధానాన్ని ప్రశ్నించారు.

అయితే దీనిపై ప్రభుత్వం తరఫు న్యాయవాది మాట్లాడుతూ స్థలం చూపించలేదని మిగతా ప్రాజెక్ట్‌ల విషయంలో.. నిర్ణయం తీసుకోకూడదనడం ఎలా అని ప్రశ్నించారు. నిజానికి నవయుగ సంస్థ ఆర్బిట్రేషన్‌కు వెళ్లాలని.. హైకోర్టుకు రావడం సరికాదన్నారు. రివర్స్‌ టెండరింగ్‌ కొనసాగించుకునేందుకు.. తమ సర్కార్‌కు అవకాశం కల్పించాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం ఈ మేరకు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.