జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. గర్భిణులకు ‘వైఎస్సార్ ఆసరా’

ఏపీలో గర్భిణులకు జగన్ సర్కార్ మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. వారికి వైఎస్సార్ ఆసరా పథకాన్ని వర్తింప జేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. గర్భిణులకు వైఎస్సార్ ఆసరా

Edited By:

Updated on: Sep 29, 2020 | 5:48 PM

YSR Asara Scheme: ఏపీలో గర్భిణులకు జగన్ సర్కార్ మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. వారికి వైఎస్సార్ ఆసరా పథకాన్ని వర్తింప జేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో సిఫార్సుల మేరకు ఆరోగ్య ఆసరా పథకాన్ని గర్భిణులకు విస్తరింపజేస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు.

ఆరోగ్య శ్రీ నెట్‌ వర్క్ ఆసుపత్రుల్లో సాధారణ, సిజేరియన్ ప్రసవం అయిన మహిళలకు వైఎస్సార్ ఆసరా పథకం వర్తించనుంది. ఈ పథకం ద్వారా  సాధారణ ప్రసవం అయిన మహిళలకు ఐదు వేల రూపాయలు, సిజేరియన్ ద్వారా ప్రసవించిన మహిళలకు 3 వేల రూపాయల ఆర్ధిక సాయాన్ని అందించాలని వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌. జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

Read More:

Prabhas Adipurush: ‘సీత’గా అనుష్క.. క్లారిటీ ఇచ్చిన దేవసేన

రాక్‌స్టార్ తమ్ముడి కొత్త రూట్‌.. పూరీతో పనిచేస్తున్న సాగర్‌