CM Jagan: అంబానీ, అదానీలు ఏపీ వైపే చూస్తున్నారు.. ఏటీసీ టైర్ల పరిశ్రమ ప్రారంభోత్సవంలో సీఎం జగన్‌

|

Aug 16, 2022 | 1:17 PM

Andhra Pradesh: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి జగన్‌ (CM Jagan) స్పష్టం చేశారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయని,

CM Jagan: అంబానీ, అదానీలు ఏపీ వైపే చూస్తున్నారు.. ఏటీసీ టైర్ల పరిశ్రమ ప్రారంభోత్సవంలో సీఎం జగన్‌
Cm Jagan
Follow us on

Andhra Pradesh: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి జగన్‌ (CM Jagan) స్పష్టం చేశారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయని, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో మూడేళ్లుగా వస్తోన్న అవార్డులే దీనికి నిదర్శనమని సీఎం గుర్తుచేశారు. విశాఖపట్నం జిల్లాలోని అచ్యుతాపురం సెజ్‌లో ఏటీసీ అలయన్స్‌ టైర్స్‌ కంపెనీని ప్రారంభించిన సీఎం జగన్‌ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిపై ప్రసంగించారు. కాగా జపాన్‌కు చెందిన ప్రముఖ టైర్ల తయారీ సంస్థ యకహోమా గ్రూప్‌నకు చెందిన అలయన్స్‌ టైర్స్‌ కంపెనీనే ఏటీసీ. రెండు దశల్లో మొత్తం రూ.2,200 కోట్లతో ఈ టైర్ల కంపెనీని ఏర్పాటుచేస్తున్నారు. తొలి దశలో రూ.1,384 కోట్లతో హాఫ్‌ హైవే టైర్ల తయారీ కంపెనీ నిర్మాణం పూర్తైంది. ఇవాళ్టి నుంచి అక్కడ టైర్ల ఉత్పత్తి ప్రారంభం కానుంది. రూ.816 కోట్లతో రెండో దశ పనులకు భూమి పూజ చేశారు జగన్‌. అలాగే రూ.1,002 కోట్లతో మరో 8 యూనిట్లకు శంకుస్థాపన చేశారు. మొత్తం 250 ఎకరాల్లో ఈ ఏటీసీ పరిశ్రమ ఏర్పాటైంది. ఈ పరిశ్రమ ద్వారా సుమారు 4,664 మందికి ఉపాధి దొరుకుతుంది.

ఈ సందర్భంగా మాట్లాడిన జగన్‌15 నెలల్లోనే ఈ పరిశ్రమ మొదటి దశ పనులు పూర్తి చేశామన్నారు. ‘రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. రాబోయే రెండేళ్లలో 56 పెద్ద కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనున్నాయి. అలాగే మూతపడ్డ ఎంఎసీఎంఈలను కూడా తెరిపిస్తున్నాం. ఇందుకోసం పెద్ద మొత్తం నిధులు మంజూరుచేస్తున్నాం. ఇక మన రాష్ట్రంలో 9 ఫిషింగ్‌ హార్బర్లు నిర్మాణంలో ఉన్నాయి. అదానీ, అంబానీ లాంటి బడా పారిశ్రామిక వేత్తలు ఏపీవైపు చూస్తున్నారు. విశాఖలో వచ్చే రెండు నెలల్లో నెలలో ఆదాని డేటా సంస్థకు శంకుస్థాపన చేస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఈ అభివృద్ధి పనులన్నీ జరుగుతున్నాయి’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, మేయర్ జి హరి వెంకట కుమారి, ఎంజీ మాధవి, జిల్లా కలెక్టర్ ఎ.మల్లిఖార్జున, పోలీస్ కమిషనర్ సిహెచ్.శ్రీకాంత్, జీవీఎంసీ కమిషనర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..