రష్మికపై కలెక్టర్ ఖాతా నుంచి కామెంట్.. అసలు జరిగిందేంటంటే.!
నటీనటులు అన్న తరువాత ఫ్యాన్స్ కామన్. ఆ అభిమానుల్లో సామాన్యులే కాదు పలు రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఉంటారు. అలాంటి
నటీనటులు అన్న తరువాత ఫ్యాన్స్ కామన్. ఆ అభిమానుల్లో సామాన్యులే కాదు పలు రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఉంటారు. అలాంటి అభిమానంతోనే హీరోయిన్ రష్మికపై ఓ కలెక్టర్ ఖాతా నుంచి ట్వీట్ వచ్చింది. రష్మిక పెట్టిన ఓ ఫొటోకు ‘చించావు పో’ అంటూ జగిత్యాల కలెక్టర్ రవి ట్విట్టర్ ఖాతా నుంచి కామెంట్ వచ్చింది. దీంతో వివాదం మొదలైంది.
అయితే ఈ ట్వీట్‌పై కలెక్టర్ రవి స్పందించారు. ఆ కామెంట్ తాను పెట్టింది కాదని.. తన ట్విట్టర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారంటూ ఆయన ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసిన రవి.. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు.
Read This Story Also:ముద్దు పెట్టి పారిపోయిన ఫ్యాన్.. షాక్‌లో రష్మిక!