అలా చేస్తే రామ్‌కి కూడా నోటీసులు ఇస్తాం: ఏసీపీ

| Edited By:

Aug 16, 2020 | 2:53 PM

స్వర్ణ ప్యాలెస్ ఘటనలో విచారణకు ఆటంకం కలిగిస్తే ఎలాంటివారైనా నోటీసులు ఇవ్వడానికి వెనుకాడబోమని ఏసీపీ సూర్యచంద్రరావు పేర్కొన్నారు.

అలా చేస్తే రామ్‌కి కూడా నోటీసులు ఇస్తాం: ఏసీపీ
Follow us on

ACP on Ram comments: స్వర్ణ ప్యాలెస్ ఘటనలో విచారణకు ఆటంకం కలిగిస్తే ఎలాంటివారైనా నోటీసులు ఇవ్వడానికి వెనుకాడబోమని ఏసీపీ సూర్యచంద్రరావు పేర్కొన్నారు. ఈ ఘటనపై మాట్లాడిన ఆయన హీరో రామ్ పెట్టిన ట్వీట్లను తప్పుపట్టారు. క్వారంటైన్‌ సెంటర్‌కి, కోవిడ్ కేర్ సెంటర్‌కి తేడా తెలుసుకోకుండా పోస్టింగులు పెట్టడం సరికాదని ఆయన సూచించారు. తన బాబాయ్ డాక్టర్‌ రమేష్‌ని కాపాడుకొనేందుకు అసత్య ఆరోపణలతో విచారణకు అడ్డు తగిలితే రామ్‌కి కూడా నోటీసులు ఇస్తామని సూర్యచంద్ర రావు హెచ్చరించారు.

స్వర్ణ ప్యాలెస్ ఘటనపై పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపిన ఆయన.. రమేష్ బాబు ఆడియోలో పోలీసులపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. దర్యాప్తులో కీలక ఆధారాలు సేకరిస్తున్నామని.. రమేష్ ఆసుపత్రిలో 51% షేర్లు ఆస్టర్ కంపెనీకి వాటా ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. ఈ క్రమంలో ఆస్టర్ కంపెనీకి కూడా నోటీసులు ఇస్తామని, ఆ కంపెనీ బోర్డ్ డైరెక్టర్ల పాత్రపై విచారణ చేస్తామని వెల్లడించారు. రమేష్ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ మమత, మరో ముగ్గురిని విచారించామని ఏసీపీ తెలిపారు. ఇక రమేష్ అల్లుడు కళ్యాణ్ చక్రవర్తి విచారణకు హాజరుకాలేదని.. అనారోగ్యంగా ఉంది రెండు వారాలు క్వారంటెన్లో ఉండాలని మెయిల్ చేశారని సూర్యచంద్ర రావు వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నామని వివరించారు.

ఇక వృద్ధాప్యంలో ఉన్న మహిళలు ఉన్నట్లైతే తమ సిబ్బందిని ఇంటికి పంపుతున్నామని పేర్కొన్నారు. డాక్టర్ రమేష్ కలెక్టర్ కార్యాలయానికి విచారణకు వచ్చి పరారయ్యారని.. సెల్ స్విచ్ ఆఫ్ చేసి, సొంత కారును అక్కడే వదిలేసి మరో కారులో వెళ్లిపోయారని ఏసీపీ వెల్లడించారు. స్వర్ణ ప్యాలస్, రమేష్ ఆసుపత్రి మధ్య ఎలాంటి అగ్రిమెంట్ జరిగిందో ఇప్పటి వరకు తమకు చూపించలేదని.. ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలు ఉంటే రామ్ మాకు అందించాలని సూర్యచంద్ర రావు తెలిపారు.

Read More:

సీక్రెట్‌గా కాజల్ ఎంగేజ్‌మెంట్‌.. హాజరైన బెల్లంకొండ!

సోదరుడి మృతి.. ట్రంప్ భావోద్వేగ ప్రకటన‌