ఉన్నత చదువులు అభ్యసించి, మంచి ఉద్యోగం తెచ్చుకుందామన్న కలలతో నెల రోజుల క్రితమే అమెరికా (America) వెళ్లాడు ఆ యువకుడు. గర్భంతో ఉన్న భార్య, తల్లిదండ్రులను వదిలేసి మరి యూఎస్ ఫ్లైట్ ఎక్కాడు. చదువుతో పాటు ఉపాధి కోసం ఓ చోట పనికి చేరాడు. అంతా బాగుందనుకున్న సమయంలో కొందరు దోపిడీ దొంగలు అతని పాలిట యమకింకరులయ్యారు. డబ్బుకోసం తుపాకీతో కాల్చి చంపారు. ఇది అమెరికాలో గురువారం (ఫిబ్రవరి 10) దోపిడీ దొంగల చేతిలో దారుణ హత్యకు గురైన 27 ఏళ్ల సత్యకృష్ణ చిట్టూరి నేపథ్యం.
నెల రోజుల క్రితమే అమెరికాకు..
విశాఖపట్నంకు చెందిన చిట్టూరి సత్యకృష్ణ చిట్టూరికి కొన్ని నెలల క్రితమే వివాహమైంది. ప్రస్తుతం అతని భార్య గర్భంతో ఉంది. త్వరలోనే పండంటి బిడ్డకు స్వాగతం పలుకుదామన్న ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. నెల రోజుల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన సత్యకృష్ణ ఉపాధి కోసం ఓ దుకాణంలో స్టోర్ క్లర్క్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం గుర్తు తెలియని దోపిడీ దొంగలు డబ్బు కోసం అతనిపై కాల్పులు జరిపారు.
దీంతో సంఘటనా స్థలంలోనే అతను ప్రాణాలు కోల్పోయాడు. దీంతో విశాఖలోని అతని కుటుంబంలో విషాధ చాయలు అలుముకున్నాయి. సత్యకృష్ణ మృతదేహాన్ని వెంటనే భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని అతని కుటుంబీకులు, బంధువులు కోరుతున్నారు.
Also Read:సైకిలెక్కి సవారీ చేస్తున్న ఈ బూరె బుగ్గల చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?
IPL 2022 Auction: మొదలైన క్రికెట్ అభిమానుల పండగ.. తొలిరోజు వేలంలో ఎంతమంది ప్లేయర్లంటే?