Visakha Crime News: విశాఖపట్టణం పూడిమడక సీతాపాలెం బీచ్‌లో హృదయవిధారక ఘటన జరిగింది. సొంత అన్నయ్య ముందే తమ్ముడు గల్లంతయ్యాడు. అలల ధాటికి తమ్ముడు మునిగిపోతుండటం చూసిన అన్నయ్య తల్లడిల్లిపోయాడు. విశాఖపట్నం దుప్తురు గ్రామానికి చెందిన శ్యామ్ అనే 16 ఏళ్ల బాలుడు, అతడి అన్నయ్య ఇద్దరు కలిసి విశాఖపట్నం సీతాపాలెం బీచ్ చూడటానికి వచ్చారు. అయితే అలల దాటికి శ్యామ్ సముద్రంలో గల్లంతయ్యాడు. అన్నయ్య రక్షించడానికి ప్రయత్నించినా కుదరలేదు.
కళ్ళముందే తమ్ముడు కేకేలు వేస్తూ సముద్రంలో మునిగిపోయాడు. ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న అన్నయ్య తమ్ముడిని చూసి బోరున విలపించాడు. గగ్గోలు పెడుతూ చుట్టూ ప్రక్కల ఉన్న గ్రామస్తులకు విషయం తెలిపాడు. స్పందించిన గ్రామస్తులు బాలుడి కోసం సముద్రంలో గాలించినా ప్రయోజనంలేకపోయింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సముద్రం వద్దకు వచ్చి దుఃఖంతో మునిగిపోయారు. చేతికందిన కొడుకు సముద్రంలో మునిగిపోవడం చూసి భరించలేక విలపించారు. కుటుంబ సభ్యుల రోదనలు అందరిని కంటతడి పెట్టించాయి. కాగా యువకుడి కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.