South Coast Railway Zone: ఏపీకి మరో గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కార్.. సాకారం కాబోతున్న ఏళ్ల నాటి కల..

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు మరో గుడ్ న్యూస్ ప్రకటించింది.. రాష్ట్ర విభజన టైమ్‌లో ఇచ్చిన హామీని నేరవేర్చుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.. దీంతో ఏళ్ల నాటి కల సాకారం కాబోతోంది. సౌత్‌ కోస్ట్‌ రైల్వేజోన్‌కు శుక్రవారం కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది..

South Coast Railway Zone: ఏపీకి మరో గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కార్.. సాకారం కాబోతున్న ఏళ్ల నాటి కల..
Pawan Kalyan Chandrababu

Updated on: Feb 07, 2025 | 10:15 PM

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు మరో గుడ్ న్యూస్ ప్రకటించింది.. రాష్ట్ర విభజన టైమ్‌లో ఇచ్చిన హామీని నేరవేర్చుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.. దీంతో ఏళ్ల నాటి కల సాకారం కాబోతోంది. సౌత్‌ కోస్ట్‌ రైల్వేజోన్‌కు శుక్రవారం కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.. విశాఖ కేంద్రంగా సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. వాల్తేర్ డివిజన్ పేరు విశాఖపట్నం డివిజన్‌గా మార్పు చేసింది.. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కొత్త జోన్‌ ను ఏర్పాటు చేసింది.. పోస్ట్ ఫ్యాక్టో అప్రూవల్ ఇచ్చినట్టు కేంద్రం వెల్లడించింది.. పాత వాల్తేర్‌ డివిజన్‌ను కేంద్రం రెండుగా విభజించింది.. 410 కి.మీ మేర విశాఖపట్నం డివిజన్‌గా మార్పు చేసింది.. మిగతా 680 కి.మీ.రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్‌ ఏర్పాటు చేసింది.. రాయగడను ఈస్ట్‌కోస్ట్‌ రైల్వేలో చేరుస్తూ నిర్ణయం తీసుకుంది.

కాగా.. ఏపీ విభజన చట్టం ప్రకారమే సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. పోస్ట్ ఫ్యాక్టో అప్రూవల్ ఇచ్చినట్టు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో ఇచ్చిన హామీ మేరకు కొత్త జోన్ ఏర్పాటు చేస్తున్నామని.. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..