Pawan Kalyan: పవన్‌కు విశాఖ పోలీసుల నోటీసులు.. రెచ్చగొట్టే ప్రసంగాలు చెయ్యొద్దంటూ..

జనసేనాని పవన్ కళ్యాణ్‌కి విశాఖ పోలీసులు ఇచ్చిన నోటీస్‌ల్లో ఏముందంటే.. వారాహి యాత్రలో భాగంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చెయ్యొద్దని, నిరాధార ఆరోపణలు చెయ్యొద్ద, వర్గవిభేదాలు సృష్టించే వ్యాఖ్యలొద్దని సూచించారు. అలాగే జనసేన పార్టీ తరఫున ఏర్పాటు చేసే ప్రోగ్రామ్స్ షెడ్యూల్ ముందేగానే చెప్పాలని, శాంతికి విఘాతం కలిగించబోమని హామీ ఇవ్వాలని, పోలీసు నిబంధనలు ఫాలో అవ్వాలని విశాఖ పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. రుషికొండ పర్యటనకు వెళ్లనున్న పవన్ కళ్యాణ్‌కి..

Pawan Kalyan: పవన్‌కు విశాఖ పోలీసుల నోటీసులు.. రెచ్చగొట్టే ప్రసంగాలు చెయ్యొద్దంటూ..
Pawan Kalyan

Updated on: Aug 11, 2023 | 5:40 PM

విశాఖపట్నంలోని నోవాటెల్ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రుషికొండ సందర్శనకు బయల్దేరారు. ఇక పవన్ రుషికొండ పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. పవన్ కారుతో పాటు మరో ఏడు కార్లను పోలీసులు అనుమతించారు. నోవాటెల్ నుంచి రుషికొండకు 10 కిలోమీటర్ల దూరం ఉండగా.. జనసేన కార్యకర్తలు, అభిమానులతో కలిసి ర్యాలీగా రుషికొండకు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్. మరోవైపు పవన్ పర్యటిస్తున్న మార్గంలో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. జోడుగుళ్లపాలెం దగ్గర పోలీసులు భారీగా పోలీసులు మొహరించారు. రుషికొండను రోడ్డు మీద నుంచి చూసేందుకు పవన్‌కు అనుమతులు ఇవ్వగా.. ఆయన రోడ్డు మీద నుంచి చూస్తారా.? లేక పైకి వెళ్తారా.? అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

పవన్‌కు పోలీసుల నోటిసులు..

నిన్న జరిగిన వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారంటూ విశాఖ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. పోలీసుల నోటీసుల్లో 3 సూచనలతో పాటు మరో 3 అదేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వాటిని ఫాల్లో అవ్వాల్సిందేనని పోలీసులు ఆ నోటీసులో ప్రస్తావించారు. దీంతో ప్రస్తుతం విశాఖపట్నంలో టెన్షన్.. టెన్షన్ నెలకొంది. నోవాటెల్ హోటల్ దగ్గర హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. అలాగే పవన్ కారును ర్యాలీగా ఫాలో అవుతున్నారు జనసేన కార్యకర్తలు, అభిమానులు.

అసలు ఇంతకీ జనసేనాని పవన్ కళ్యాణ్‌కి విశాఖ పోలీసులు ఇచ్చిన నోటీస్‌ల్లో ఏముందంటే.. వారాహి యాత్రలో భాగంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చెయ్యొద్దని, నిరాధార ఆరోపణలు చెయ్యొద్దని, వర్గవిభేదాలు సృష్టించే వ్యాఖ్యలొద్దని సూచించారు. అలాగే జనసేన పార్టీ తరఫున ఏర్పాటు చేసే ప్రోగ్రామ్స్ షెడ్యూల్ ముందేగానే చెప్పాలని, శాంతికి విఘాతం కలిగించబోమని హామీ ఇవ్వాలని, పోలీసు నిబంధనలు ఫాలో అవ్వాలని విశాఖ పోలీసులు పేర్కొన్నారు.

రుషికొండ పర్యటన నేపథ్యంలో జనసేన ట్వీట్స్

కాగా, నిన్న జరిగిన సభకు సెక్షన్‌ 30 కింద సభకు అనుమతి తీసుకున్న కోనా తాతారావుకు నోటీసులు జారీ చేశారు విశాఖ పోలీసులు. వారాహి యాత్రలో అనుచిత వ్యాఖ్యలు చేశారని, అవి చట్ట విరుద్ధమంటూ పోలీసులు తమ నోటీసుల్లో పేర్కొన్నారు. సభల్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలని లేదంటే నిర్వాహకులదే బాధ్యతంటూ హెచ్చరించారు.