AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag: కంటిపాపలను కాటేశాడు.. వేసిన శిక్ష సరిపోదు అంటున్న సమాజం

ఆడబిడ్డలకు రక్షకుడై ఉండాల్సిన తండ్రే విశాఖలో రాక్షసుడయ్యాడు. ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడిన తండ్రికి పాక్సో ప్రత్యేక కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే జరిమానా కూడా వేసింది. బాధిత బాలికలకు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Vizag: కంటిపాపలను కాటేశాడు.. వేసిన శిక్ష సరిపోదు అంటున్న సమాజం
Girl (A representative image)
Maqdood Husain Khaja
| Edited By: Ram Naramaneni|

Updated on: Aug 23, 2025 | 4:15 PM

Share

ఆడపిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్‌దే. ఇందులోను తండ్రి పాత్ర ప్రధానమైదని. ఏ తండ్రి అయినా ఆడబిడ్డలకు రక్షణగా నిలుస్తాడు. కానీ విశాఖలో మాత్రం ఓ తండ్రి క్రూర మృగంలా మారాడు. ఇద్దరూ కూతుర్లపై కన్నేసి.. లోకం ఊహ పూర్తిగా తెలియని వారిని చెరబట్టాడు. విషయం బయటపడడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆధారాలన్ని కోర్టుకు సమర్పించారు. దీంతో కోర్టు సంచలన తీర్పు చెప్పింది. 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది న్యాయస్థానం.

కేసు వివరాల్లోకి వెళితే.. ఒరిస్సాకు చెందిన చిత్తరంజన్ పాత్రో ఉపాధి కోసం విశాఖ కుటుంబంతో పాటు వచ్చాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నా4రు. పెద్ద కుమార్తెకి 12 ఏళ్లు.. చిన్న కుమార్తెకి 8 ఏళ్లు. ఆరిలోవలో నివాసం ఉంటున్నాడు. భార్య కార్పొరేట్ ఆసుపత్రిలో పనిచేస్తూ ఉండేది. ఆమె రాత్రి వేళల్లో ఎక్కువగా డ్యూటీ చేసేంది. ఈ క్రమంలో… ఇంట్లో ఉండే కూతుళ్లపై కన్నేశాడు ఈ పాపిష్టితండ్రి. తొలుత పెద్ద కుమార్తెపై లైంగిక దాడి చేశాడు. పాపం భయంతో వద్దని వారించినా పైకి చెబితే చంపేస్తానని బెదిరించి.. తన ఆకృత్యాన్ని కొనసాగించాడు. కొన్నాళ్ల తర్వాత చిన్న కుమార్తెపై వాడి కళ్లు పడ్డాయి. ఆ బుజ్జితల్లిపై కూడా ఆకృత్యానికి పాల్పడ్డాడు. చీకటి పడిందంటే చాలు తండ్రి కనపడితే భీతిల్లేవారు పిల్లలు.

ఎవరికీ చెప్పుకోలేక.. లోలోన పంటి బిగువున్న బాధను భరిస్తూ వచ్చారు. పెద్ద పాప స్కూల్లో ముభావంగా ఉండటాన్ని టీచర్ గుర్తించింది. అక్కున చేర్చుకుని కౌన్సిలింగ్ చేసేసరికి అసలు విషయం బయటపడింది. దీంతో గత ఏడాది సెప్టెంబర్ 24న ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసును మహిళా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఏసీపీ పెంటారావు తన బృందంతో దర్యాప్తు చేసి పూర్తి ఆధారాలతో ఛార్జ్‌షీట్ కోర్టులో దాఖలు చేశారు. నేరం నిర్ధారణ అవ్వడంతో కేసు విచారిస్తున్న పాక్సో ప్రత్యేక కోర్టు కీలక తీర్పు చెప్పింది. ఇద్దరు కూతుళ్లను కాటేసిన కన్నతండ్రి చిత్తరంజన్ పాత్రోకు.. 20 ఏళ్ల కఠిన జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతోపాటు 3000 జరిమానా కూడా విధించింది. బాలికలకు ఆసరా కోసం  మూడు లక్షల పరిహారం అందజేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..