Vizag: ఈ పువ్వు చూడ్డానికి భిన్నంగా, వింతగా ఉంది కదా.. కానీ దాని వాసన..
ప్రకృతిలో అనేక రకాల ఫల పుష్పాలు చూస్తూ ఉంటాం.. ఒక్కో పుష్పానిది ఒక్కో ప్రత్యేకత.. మీరు ఎన్నో రకాల పుష్పాలను చూసి ఉండొచ్చ .. కానీ దారం లాంటి రేకుల పుష్పాన్ని చూశారా..? ఎస్.. విశాఖలో అలాంటి పుష్పమే ఇప్పుడు ఆకర్షిస్తుంది. దాదాపు పదేళ్ల తర్వాత ఆ ఉద్యానవనంలో వికసించింది.

పైన ఫోటోలో ఉన్న మొక్క శాస్త్రీయ నామం బుల్బోఫిలమ్ మెడుసే. దీనిని సాధారణంగా మెడుసా ఆర్చిడ్ అని కూడా పిలుస్తారు. ఇది ఎపిఫైటిక్ ఆర్చిడ్. దాని విలక్షణమైన పూల నిర్మాణం కారణంగా ప్రత్యేకత సంతరించుకుంది. ఇది పొడవైన, దారం లాంటి పూల రేకులతో పార్శ్వ సీపల్స్‌ను కలిగి ఉంటుంది. ఈ పుష్పాలు పువ్వులు సాధారణంగా క్రీమీ తెలుపు లేదా లేత పసుపు రంగులో ఉంటాయి. అలాగే పుష్పించే కాండం చివరన వృత్తాకార సమూహంలో అమర్చబడి ఉంటాయి. ఇది ఒక ఎపిఫైటిక్ ఆర్చిడ్. పాకే రైజోమ్ అని అంటున్నారు ప్రొఫెసర్ రామమూర్తి. ప్రతి సూడోబల్బ్ పైభాగం నుంచి 4 అంగుళాల పొడవు గల ఒకే ఆకుతో ఉద్భవిస్తుంది. దాదాపు 120 మిల్లీమీటర్ల పొడవున్న దారం లాంటి పార్శ్వ సీపల్స్ కలిగి ఉంటాయి.
విశాఖలోని డాల్ఫిన్ నేచర్ కన్జర్వేటివ్ సొసైటీ.. జీవవైవిద్య పార్క్‌లో ఈ పుష్పం వికసించింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత బుల్బోఫిలమ్ మెడుసే పుష్పం కనిపించిందని అంటున్నారు ప్రొఫెసర్ రామమూర్తి. ఈ పుష్పాన్ని సందర్శకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. అయితే ఇది చూసేందుకు ఎంత అందంగా కనిపిస్తూ ఆకర్షిస్తుంది కదా..! కానీ దాని వాసన మాత్రం చాలా ఘాటుగా ఇబ్బందికరంగా ఉంటుందట. కానీ అదే వాసన పరాగ సంపర్కం కోసం ఈగలను ఆకర్షిస్తుందట.
