ఎంత పనిచేశావ్‌ రా.. క్రికెట్ మ్యాచ్‌లో ఒక్క రన్ కోసం గొడవ.. ఆ తర్వాత కత్తితో దారుణంగా..

క్రికెట్ మ్యాచ్ సందర్భంగా చెలరేగిన వివాదం యువకుడి హత్య కు దారి తీసింది. ఒక్క పరుగు కోసం వాగ్వాదం మొదలై సర్దుబాటు జరిగింది. మ్యాచ్ ముగిసినా.. ఆ తరువాత కక్షతో కత్తి దూసాడు ఓ యువకుడు. నడి రోడ్డుపైనే మళ్ళీ గొడవ పెట్టుకుని మరీ దాడి చేసాడు. ఈ ఘటనలో అజిత్ ప్రాణాలు కోల్పోగా.. మరో యువకుడు గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు.

ఎంత పనిచేశావ్‌ రా.. క్రికెట్ మ్యాచ్‌లో ఒక్క రన్ కోసం గొడవ.. ఆ తర్వాత కత్తితో దారుణంగా..
Arilova Tragedy: Ajith - Kishor (Accused)

Edited By:

Updated on: Apr 06, 2026 | 9:47 AM

క్రికెట్ మ్యాచ్ సందర్భంగా చెలరేగిన వివాదం యువకుడి హత్య కు దారి తీసింది. ఒక్క పరుగు కోసం వాగ్వాదం మొదలై సర్దుబాటు జరిగింది. మ్యాచ్ ముగిసినా.. ఆ తరువాత కక్షతో కత్తి దూసాడు ఓ యువకుడు. నడి రోడ్డుపైనే మళ్ళీ గొడవ పెట్టుకుని మరీ దాడి చేసాడు. ఈ ఘటనలో అజిత్ ప్రాణాలు కోల్పోగా.. మరో యువకుడు గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మ్యాచ్ ఆడుతున్న ఇరు జట్లు బాగానే ఉన్నాయి.. కానీ సంబంధం లేని వ్యక్తి.. మ్యాచ్‌లో కలగజేసుకుని వివాదానికి వెళ్లినట్టు పోలీసుల విచారణలో తేలింది.

విశాఖ ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధి పెదగదిలి ప్రాంతంలో వీకెండ్ వస్తే చాలు యువకుల సందడే సందడి. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్రికెట్ మ్యాచ్‌లు ఆడుతూ గడుపుతుంటారు. వేర్వేరు జట్లు కూడా అక్కడకు చేరి.. సిరీస్ మాదిరిగా ఒప్పందం గుర్తుకొని పోటాపోటీగా క్రికెట్లో పాల్గొంటారు. ఆదివారం నాడు కూడా.. వినాయక నగర్, చాకలిపేట, పెద్దగదిలి ప్రాంతాలకు చెందిన మూడు జట్లు సిరీస్ ఆడాలని నిర్ణయించుకున్నాయి. అక్కడకు యువకులంతా అక్కడకు చేరుకున్నారు.

వివాదం అలా మొదలైంది..

మూడు జట్లను డ్రా తీశారు పెదగదిలి టీమ్‌కు బై పడింది. వినాయక నగర్, చాకలిపేట టీమ్స్ మధ్య మ్యాచ్.. వారిలో గెలిచిన వాళ్ళు పెదగదిలి జట్టుతో ఆడాల్సి ఉంది. రెండు జట్లు మ్యాచ్ ఆడుతుండగా భయపడిన మూడో జట్టు సభ్యుడు అంపైర్‌గా నిలుచున్నాడు. మ్యాచ్ ఆడుతున్న జట్లలో డోలా అజిత్‌ అలియాస్‌ పెద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. అక్కడికి వచ్చిన కిట్టు కిశోర్ అలియాస్ బాక్సర్ కిషోర్‌.. పక్కన కూర్చొని మ్యాచ్‌ చూస్తున్నాడు. అజిత్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా ఒక్క పరుగు విషయంలో ఆటగాళ్లతో వాగ్వాదం జరిగింది. మ్యాచ్ కు అంపైర్‌గా వ్యవహరిస్తున్న చిరంజీవి వివాదాన్ని సర్దుబాటు చేశాడు. ఇదంతా పక్క నుంచి చూస్తున్న గంటా కిషోర్‌.. అంపైర్ చిరంజీవితో వాగ్వాదానికి దిగాడు. దీనిని అజిత్‌ ప్రశ్నించడంతో ఇరువర్గాల మధ్య వివాదం రేగింది. ఇంతలో పక్కన ఉన్నవారు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించేశారు.

మళ్ళీ వివాదం..

అయితే.. కిట్టు కిశోర్ అలియాస్ బాక్సర్ కిషోర్‌.. భార్యతో కలిసి విశాలక్షినగర్‌లో నివాసముంటున్నాడు. అప్పుడప్పుడు పెదగదిలి వచ్చివెళుతుంటాడు. ఇదిలా ఉండగా మ్యాచ్ సందర్భంగా వివాదం జరిగి సర్దుబాటు జరిగిన తర్వాత ఎవరు ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో కిషోర్‌.. విశాలక్షినగర్‌ నుంచి పెదగదిలి వచ్చాడు. అక్కడ యువకులతో మళ్లీగొడవపడ్డాడు. అదే సమయంలో పక్కనే ఉన్న అజిత్‌పై దాడిచేసి.. తనతోపాటు తెచ్చుకున్న కత్తితో ఛాతిలో పొడిచేశాడు. ఈ హఠాత్పరిణామాన్ని గుర్తించిన అక్కడే ఉన్న మరి కొంతమంది యువకులు వారించే ప్రయత్నం చేశారు. నాగు అనే యువకుడు అడ్డుకునేందుకు యత్నించగా.. అతని పైనా దాడి జరిగి చేతికి గాయమైంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అజిత్‌ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రి తరలించే సరికి ప్రాణాలు విడిచాడు. దీంతో ఆ కుటుంబం, స్నేహితులు తీవ్ర విషాదంలోకి వెళ్లారు.

పోలీసుల అదుపులో నిందితుడు..

గాయపడిన నాగును సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఆరిలోవ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. నిందితుడు కిషోర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌ మార్చురికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు కిషోర్ ఈవెంట్స్ ఫోటోగ్రాఫర్ అని పోలీసులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us