Visakhapatnam: విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బాబాయ్ ఇంటికి వెళ్లి వస్తుండగా..

|

Aug 19, 2021 | 9:35 AM

Visakhapatnam: విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం నాడు కాకాని నగర్ హైవేపై బైక్ ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతులు ప్రాణాలు కోల్పోయారు.

Visakhapatnam: విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బాబాయ్ ఇంటికి వెళ్లి వస్తుండగా..
Follow us on

Visakhapatnam: విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం నాడు కాకాని నగర్ హైవేపై బైక్ ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు గాజువాక జగ్గు జంక్షన్‌కు చెందిన నాగేశ్వరరావు, రమాదేవిగా గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా వేటపాలేనికి చెందిన నాగేశ్వరరావు, విశాఖలోని ఓ ప్రైవేట్ కాలేజీలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. దాంతో అతను కుటుంబ సభ్యులతో కలిసి గాజువాకలో ఫ్యామిలీతో కలిసి నివాసం ఉంటున్నాడు.

అయితే, గురువారం నాడు మర్రిపాలెంలో ఉంటున్న తన బాబాయ్ ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి బైక్‌పై తిరిగి వస్తుండగా.. కాకానినగర్ హైవేపై వారి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్య రమాదేవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. నాగేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలిస్తుండగా.. ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లారీ అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

Also read:

Ram Gopal Varma: అషురెడ్డి దగ్గర అగ్లీ క్రియేటివిటీ ప్రదర్శించిన ఆర్జీవి.. మండిపడుతున్న నెటిజన్స్..

ఆఫ్గనిస్తాన్ కు తిరిగి వస్తా…చర్చలు జరుపుతున్నా..మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని

లోకల్ To గ్లోబల్: మహిళలను చిత్రహింసలు పెట్టి చంపుతున్నారు..తాలిబన్లుపై మొదలైన తిరుగుబాటు..: Local To Global video.