Vinayaka Chavithi: వినాయక చవితి రోజున చిత్రకారుడి అద్భుత ప్రతిభ.. విభిన్న రూపాల్లో అబ్బుర పరిచిన చిత్రాలు!

| Edited By: Balaraju Goud

Sep 07, 2024 | 10:36 AM

హిందువులకు తొలి పండుగ వినాయక చవితి. 'భాద్రపద శుద్ధ చవితి' రోజున విఘ్నేశ్వరుడి పుట్టిన రోజు అని వినాయక చతుర్ది పండుగను జరుపుకుంటారు. వినాయక చవితి సందర్భంగా నంద్యాల జిల్లాకు చెందిన ప్రముఖ చిత్రకారుడు గీసిన చిత్రం అందరిని అబ్బుర పరుస్తోంది.

Vinayaka Chavithi: వినాయక చవితి రోజున చిత్రకారుడి అద్భుత ప్రతిభ.. విభిన్న రూపాల్లో అబ్బుర పరిచిన చిత్రాలు!
Ganesh On Box
Follow us on

హిందువులకు తొలి పండుగ వినాయక చవితి. ‘భాద్రపద శుద్ధ చవితి’ రోజున విఘ్నేశ్వరుడి పుట్టిన రోజు అని వినాయక చతుర్ది పండుగను జరుపుకుంటారు. వినాయక చవితి సందర్భంగా నంద్యాల జిల్లాకు చెందిన ప్రముఖ చిత్రకారుడు గీసిన చిత్రం అందరిని అబ్బుర పరుస్తోంది. అగ్గి పెట్టెపై చిత్రకారుడు అరవై వినాయక సూక్ష్మ చిత్రాలను అద్భుతంగా చిత్రీకరించి గణనాథుడిపై ఉన్న భక్తిని చాటుకున్నాడు.

కేవలం రెండు గంటల సమయంలో ఎంతో భక్తి శ్రద్ధలతో 2 అంగుళాల పొడవు, 22 అంగుళాల వెడల్పు 60 సూక్ష్మ వినాయక చిత్రాలు వాటర్ కలర్స్‌తో చిత్రీకరించి తన ప్రతిభను చాటుకున్నాడు. చిత్రకారుడు కోటేష్ గత 20 సంవత్సరాల కాలంగా వినాయకచవితి పండుగ రోజున వినాయకుడి చిత్రాలు వెయ్యడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి సంవత్సరంలాగే ఈసారి అగ్గిపెట్టె మీద వివిధ రూపాల్లో గణనాథుడిని తీర్చిదిద్దాడు కోటేష్.

గణేశుడు భక్తులకు అభయమిస్తున్నట్లు, త్రిముఖ గణపతి, నాట్యగణపతి, శంఖులో గణపతి, ఓం ఆకారంలో గణేశుడు, కాణిపాకం గణపతి, ఇలా అనేక భంగిమల్లో స్వామి చిత్రాలను చిత్రీకరించారు. కళా నైపుణ్యంతోపాటు తన భక్తిని చాటుకున్నాడు సూక్ష కళకారుడు కోటేష్. చిత్రకారుడు వినాయకుడి పై ఎంతో భక్తిశ్రద్ధలతో గీసిన అద్బుతమైన చిత్రాన్ని చూసి స్థానికులు, భక్తులు అభినందిస్తూన్నారు.

వీడియో చూడండి…

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..