దారి తప్పి గ్రామంలో ప్రత్యక్షమైన జింక.. కుక్కుల బారి నుంచి కాపాడిన గ్రామస్థులు..

| Edited By:

Jul 01, 2020 | 8:08 PM

కరోనా కాలంలో కొనసాగుతున్న లాక్‌డౌన్ నేపథ్యంలో వాహనాల రాకపోకలు కాస్త తగ్గిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అడవిలో ఉన్న జంతువులన్నీ రోడ్లపైకి.. గ్రామాల్లోకి వస్తున్నాయి. తాజగా..

దారి తప్పి గ్రామంలో ప్రత్యక్షమైన జింక.. కుక్కుల బారి నుంచి కాపాడిన గ్రామస్థులు..
Follow us on

కరోనా కాలంలో కొనసాగుతున్న లాక్‌డౌన్ నేపథ్యంలో వాహనాల రాకపోకలు కాస్త తగ్గిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అడవిలో ఉన్న జంతువులన్నీ రోడ్లపైకి.. గ్రామాల్లోకి వస్తున్నాయి. తాజగా చిత్తూరు జిల్లాలోని మాధవరం గ్రామంలో కూడా ఇలాంటి ఓ సంఘటన చోటుచేసుకుంది. అడవిలోకి వెళ్లాల్సింది పోయి.. దారి తప్పి గ్రామంలోకి ఎంటర్‌ అయ్యింది.
దీంతో గ్రామంలో ఉన్న కుక్కలు అరవసాగాయి. అంతేకాదు.. దానిపై దాడి చేయబోయాయి. అయితే దీనిని గమనించిన గ్రామస్థులు వెంటనే ఆ జింకను కాపాడారు. స్థానికంగా ఉన్న పాఠశాలలో దానిని పెట్టి.. కుక్కల బారిన పడకుండా రక్షించారు. ఆ తర్వాత విషయాన్ని స్థానిక పోలీసులకు తెలిపారు. దీంతో వారు అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. గ్రామానికి వచ్చిన అటవీ శాఖ అధికారులు.. ఆ జింకకు చికిత్స చేసి.. తిరిగి అటవీ ప్రాంతంలో వదిలేశారు.