మామిడి చెట్టు(Mango Tree) మొదలుకు వినాయకుడి(Ganesha) రూపం వచ్చిందంటూ జనం తండోప తండాలుగా వస్తున్నారు. వినాయకుని తొండం ఆకారంలో చెట్టుమొదలు ఉండటంతో సాక్షాత్తూ లంబోదరుడే తమ ఇంటి పెరట్లో వెలశాడంటూ ఇంటి యజమాని ధూప,దీప, నైవేద్యాలతో పూజలు ప్రారంభించారు. ముందు ఆ ఇంటి యజమాని, పిల్లలతో ప్రారంభమైన వినాయకుని పూజలు క్రమంగా ఊరంతా పాకాయి. దీంతో జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చి మామిడి మొదలులో వినాయకుని రూపాన్ని చూసుకుని పరవశించిపోతున్నారు. ప్రకాశం జిల్లా చీరాల మండలం హస్తినపురం గ్రామంలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంటి పెరటిలోని మామిడి చెట్టు మొదలుకి వినాకుకుని తొండం పోలిన ఆకారం కనివిందు చేస్తుంది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడటంతో మహిళలు , భక్తులు పెద్ద సంఖ్యలో చెట్టు వద్దకు చేరుకొని గణనాధుని కి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ పరవశించి పోతున్నారు.
మండలంలోని హస్తీనపూరం గ్రామానికి చెందిన ఇనుమర్తి సూర్యకాంతం ఇంటి అవరణలోని ఈ మామిడి చెట్టు మొదలులో వినాయకుడు రూపం లో దర్శనమిస్తుంది. దింతో ప్రతి రోజు పూజలు నిర్వహిస్తున్నామని తమ ఇంటి అవరణలోని చెట్టులో బొజ్జ గణపయ్య కోలువై ఉండటం చాలా సంతోషం ఉందంటున్నారు ఇంటి యాజమాని సూర్యకాంతం.
ఈ సందర్బంగా సూర్యకాంతం ఇంటికి వస్తున్న జనానికి వినాయకుని రూపమే కాకుండా నాగేంద్రస్వామి ఆకారం కూడా కనిపించడంతో తమ గ్రామంలో దేవుళ్ళు ఈ రూపంలో వెలవడం చాలా ఆనందంగా ఉందని భక్తి పరవశ్యంలో మినిగితేలుతున్నారు.
ఇవి కూడా చదవండి: బెంగాల్ మరో దారుణం.. పది మంది సజీవ దహనం.. మృతుల్లో చిన్నారులతోపాటు మహిళలు..
Amaranth Health Benefits: వీరికి ఈ చిరుధాన్యలు దివ్యమైన ఆహారం.. ఎన్ని లాభాలో తెలిసిస్తే..