Andhra Pradesh: ఓ లాంగ్ రైడ్ కు పోదామనుకున్న యువకులు.. కట్ చేస్తే మైండ్ బ్లాంక్ ట్విస్ట్.. చెట్టుకు కట్టేసి మరీ..

| Edited By: Shiva Prajapati

Aug 17, 2023 | 12:58 PM

అర్దరాత్రి ఇంటి ముందు ఉన్న బైక్ లోని పెట్రోల్ తీస్తూ అడ్డంగా దొరికిపోయారు యువకులు. దొంగలు అనుకుని పట్టుకుని చెట్టుకు కట్టేసారు గ్రామస్తులు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం కొనలపల్లి గ్రామంలో శివారులో జరిగింది ఈ ఘటన. ఐదుగురు యువకులను దొంగలు అనుకుని పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేసారు గ్రామస్తులు. ఇంటి యజమాని సత్యనారాయణ ఆరు బయట నిద్రిస్తున్నాడు. అర్దరాత్రి ఐదుగురు యువకులు కారులో వచ్చారు. ఇంటి వద్ద ఉన్న బైక్ లోని పెట్రోల్ తీస్తుండగా యువకులను పట్టుకునేందుకు..

Andhra Pradesh: ఓ లాంగ్ రైడ్ కు పోదామనుకున్న యువకులు.. కట్ చేస్తే మైండ్ బ్లాంక్ ట్విస్ట్.. చెట్టుకు కట్టేసి మరీ..
Petrol Robbery
Follow us on

బైక్ పై జామ్ జామ్ అంటూ జాలీగా వెలుతుంటే యూత్ ఎంజాయ్ చేసే కిక్కే వేరుగా ఉంటుంది. అలాంటి యువకులకు కారు దొరికితే ఎలా ఉంటుంది జాలీగా కారులో షికారు కొట్టాలని పిస్తుంది కదా.. అందులో తప్పులేదు. వయస్సు అలాంటిది కాని కారు తోలేందుకు అవసరమైన డ్రయివింగ్ లైసెన్స్ కావాలి ఇంకా కారులో ఇంథనం కూడా ముఖ్యం. కాని వాళ్లంతా 25 యేళ్లు లోపు యువకులు చేతికి కారు దొరికింది కదా అని ఓ లాంగ్ డ్రైవ్ కి వెళ్లారు. సీన్ కట్ చేస్తే పెట్రోల్ అయిపోయి దొంగలుగా మారారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది.

కారులో వచ్చి అర్దరాత్రి ఇంటి ముందు ఉన్న బైక్ లోని పెట్రోల్ తీస్తూ అడ్డంగా దొరికిపోయారు యువకులు. దొంగలు అనుకుని పట్టుకుని చెట్టుకు కట్టేసారు గ్రామస్తులు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం కొనలపల్లి గ్రామంలో శివారులో జరిగింది ఈ ఘటన. ఐదుగురు యువకులను దొంగలు అనుకుని పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేసారు గ్రామస్తులు. ఇంటి యజమాని సత్యనారాయణ ఆరు బయట నిద్రిస్తున్నాడు. అర్దరాత్రి ఐదుగురు యువకులు కారులో వచ్చారు. ఇంటి వద్ద ఉన్న బైక్ లోని పెట్రోల్ తీస్తుండగా యువకులను పట్టుకునేందుకు సత్యనారాయణ ప్రయత్నించాడు. సత్యనారాయణను తోసి పారిపోయేందుకు వారు ప్రయత్నించారు. పెట్రోల్ అయిపోవడంతో కారు ఆగిపోయింది. అక్కడి నుండి ముగ్గురు పారిపోగా ఇద్దరు యువకులను పట్టుకొని చెట్టుకు కట్టేసారు గ్రామస్తులు. పోలీసులకు సమాచారం ఇవ్వడం తో యువకులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ యువకులు ఎవరు అనే దానిపై ఎంక్వైరీ చేపట్టారు పోలీసులు. ఈ ఐదుగురు యువకులు జువ్వలపాలెంకు చెందిన వారుగా గుర్తించారు. బందువుల కారు తీసుకుని షికారుకు వచ్చినట్టు, అర్దరాత్రి పెట్రోల్ బంక్ లు తీసిలేక పోవడంతో బైక్ లోని పెట్రోల్ తీసేందుకు ప్రయత్నించారని పోలీసులు చెబుతున్నారు.

చూశారా విధి.. షికారు కోసం వెళ్లి చివరకు దొంగలుగా మారిన యువకులు కథ ఇది.. సో సరదాలు వికటించకుండా, వినోదం వికృతంగా మారకుండా ఉండాలంటే.. యూత్ బి కేర్ ఫుల్ అంటున్నారు ఇది విన్న పబ్లిక్.

 ప్రకాశం జిల్లాలో టీచర్‌కు దేహశుద్ధి.. 

ఇదిలాఉంటే.. ప్రకాశం జిల్లా పుల్లలచెరువులోని జిల్లా పరిషత్ స్కూల్‌లో ఇంగ్లీష్ టీచర్‌గా చేస్తున్నాడు రామకృష్ణ.. ప్రతిరోజు ఎదో ఒక సాకుతో రామకృష్ణ విద్యార్థినీల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఎక్కడ అంటే అక్కడ పట్టుకుంటూ మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు విద్యార్థినీలు వారి తల్లిదండ్రులకు చెప్పారు..దీంతో తల్లిదండ్రులంతా కలిసి వెళ్లి గ్రామపెద్దలకు స్కూల్‌ వెళ్లి అతడ్ని నిలదీశారు..ఆపై కోపంతో రామకృష్టను పట్టుకుని చితకబాదారు తల్లిదండ్రులు..అయితే విషయం తెలుసుకున్న పోలీసులు స్కూల్‌కు వచ్చి వారి నచ్చచెప్పి అక్కడ నుండి పంపించేశారు.ఆపై తల్లిదండ్రులు వెళ్లి పోలీస్‌స్టేషన్‌ రామకృష్ణపై ఫిర్యాదు చేశారు.. అనంతరం గ్రామస్థులు పోలీస్ స్టేషను కు వెళ్ళి ఆ ఇద్దరు ఉపాద్యాయులపై ఫిర్యాదు చేశారు.

పెట్రోల్ చోరీకి పాల్పడిన యువకులను చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు.. వీడియోను చూడొచ్చు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..