Andhra Pradesh: గంగవరం పోర్ట్‌ దగ్గర టెన్షన్.. టెన్షన్.. కార్మిక సంఘాల బంద్‌కు రాజకీయ పార్టీల మద్దతు..

Andhra Pradesh: గంగవరం పోర్ట్‌ దగ్గర టెన్షన్.. టెన్షన్.. కార్మిక సంఘాల బంద్‌కు రాజకీయ పార్టీల మద్దతు..

Shaik Madar Saheb

|

Updated on: Aug 17, 2023 | 12:53 PM

Gangavaram Port Bandh: విశాఖపట్నంలోని గంగవరం పోర్ట్ బంద్‌కు అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో పోర్ట్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. గంగవరం పోర్ట్ మెయిన్ గేటుకు 100 మీటర్ల దూరంలో అదనంగా భారీ గేటు ఏర్పాటు చేసి.. ఇరువైపులా భారీ ఇనుప కంచే ఏర్పాటు చేశారు. తమకు వేతనాల పెంచాలని..

Gangavaram Port Bandh: విశాఖపట్నంలోని గంగవరం పోర్ట్ బంద్‌కు అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో పోర్ట్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. గంగవరం పోర్ట్ మెయిన్ గేటుకు 100 మీటర్ల దూరంలో అదనంగా భారీ గేటు ఏర్పాటు చేసి.. ఇరువైపులా భారీ ఇనుప కంచే ఏర్పాటు చేశారు. తమకు వేతనాల పెంచాలని, యాజమాన్యం వేధింపులు ఆపాలని 45 రోజులుగా కార్మికులు దీక్షలు చేస్తున్నారు. యాజమాన్యం స్పందించకపోవడంతో పోర్ట్ బంద్‌కు పిలుపునిచ్చాయి అఖిలపక్ష కార్మిక సంఘాలు.దీంతో విశాఖ గంగవరం పోర్ట్‌ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆందోళనకారులు ఇనుప కంచెను దాటుకుని వెళ్లేందుకు యత్నం చేశారు. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. వేతనాలు పెంచాలి, వేధింపులు ఆపాలంటూ కార్మికులు ఈ సందర్భంగా నినాదాలు చేశారురు. దీంతో పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గంగవరం పోర్ట్‌ బంద్‌కు కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపునకు రాజకీయ పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. దీంతో గంగవరం పోర్టు దగ్గర ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Aug 17, 2023 12:51 PM