AP News: సన్నిహితంగా ఉందని వీడియో తీశాడు.. ఆ తర్వాత వేధించడం మొదలుపెట్టాడు.. చివరకు..

|

Aug 08, 2022 | 7:49 AM

మహిళను లోబర్చుకుని.. వీడియో తీసి వేధించిన వ్యక్తిని దంచి కొట్టారు గ్రామస్తులు. ఈ ఘటన ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట పరిధిలో జరిగింది.

AP News: సన్నిహితంగా ఉందని వీడియో తీశాడు.. ఆ తర్వాత వేధించడం మొదలుపెట్టాడు.. చివరకు..
Vijayawada
Follow us on

Villagers beat up man: అతనితో ఆమె సన్నిహితంగా గడిపింది.. ఇదే అదునుగా భావించిన ఆ వ్యక్తి.. అతనితో ఉన్న సమయంలో వీడియో తీశాడు. అలా తీసుకున్న వీడియోని చూపించి ఆ మహిళను వేధించడం మొదలుపెట్టాడు. ఇది తెలిసిన గ్రామస్థులు దుర్మార్గుడికి దేహశుద్ది చేశారు. ఈ షాకింగ్ ఘటన ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలోని పెనుగంచిప్రోలులో వెలుగు చూసింది. పెనుగంచిప్రోలులో గార్డెన్‌ ఫంక్షన్‌హాల్‌ని నిర్వహిస్తున్న విజయవాడకు చెందిన వేణుగోపాల్‌ అనే వ్యక్తి.. మహిళను దారుణంగా వేధించాడు. మామిడి తోటల్లో ఫంక్షన్‌ హాల్‌ ఏర్పాటు చేసి.. అక్కడ చిరు వ్యాపారం చేసుకోడానికి వచ్చిన మహిళను లోబర్చుకున్నాడు. ఆమెతో సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియో తీశాడు. అప్పటి నుంచి ఆ వీడియో చూపిస్తూ.. పలుమార్లు ఆమెని మానసికంగా శారీరకంగా వేధించాడు. ఈ వీడియోని సోషల్‌ మీడియాలో పెడతానని వేణుగోపాల్‌ బెదిరింపులకు దిగాడు.

ఈ క్రమంలో మహిళ పోలీసులను ఆశ్రయించడంతో.. వారు వీడియో డిలీట్‌ చేయాలని వార్నింగ్‌ ఇచ్చారు. కాని వేణుగోపాల్‌ డిలీట్‌ చేయకపోగా.. మళ్లీ వేధింపులకు దిగాడు. ఇటీవల ఆ వీడియో పలువురి మొబైల్స్‌లో ప్రత్యక్షమవడంతో గ్రామస్తులు తిరగబడ్డారు. ఫంక్షన్‌ హాల్‌ నిర్వాహకుడు వేణుగోపాల్‌ని స్తంభానికి కట్టేసి కొట్టారు. మరోవైపు బాధిత మహిళ తీవ్ర ఆవేదనలో ఉంది. ఆ వీడియో యువకుల సెల్‌ఫోన్లలో వైరల్‌గా మారడంపై ఆవేదన వ్యక్తం చేసింది.

పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని.. అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే విషయం ఇంత వరకు వచ్చేది కాదంటున్నారు. మరోవైపు కొందరు గార్డెన్స్ ఫంక్షన్ హాల్ నిర్వాకులు కూడా ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తుల వల్ల తమ గార్డెన్స్ కూడా చెడ్డపేరు వస్తోందని అలాంటి వారిపై తక్షణ చర్యలు చేపట్టి ఆ వీడియోను తొలగించాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి