Vikram-1: విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతం.. ఇదిగో లైవ్ వీడియో
Vikram-1 Rocket Launch : భారత అంతరిక్ష రంగంలో మరో కీలక మైలురాయి సాధించింది. శ్రీహరికోట వేదికగా చేపట్టిన విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. 12:05 నిమిషాలకు శ్రీహరికోట నుంచి నిప్పులు కక్కుతూ విక్రమ్-1 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. తొలత షెడ్యూల్ చేసిన సమయానికి సాంకేతిక సమస్య ఏర్పడడంతో 12.05 నిమిషాలకు రాకెట్‌ను నింగిలోకి పంపించారు శాస్త్రవేత్తలు.

భారత అంతరిక్ష రంగంలో మరో కీలక మైలురాయి సాధించింది. శ్రీహరికోట వేదికగా చేపట్టిన విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. 12:05 నిమిషాలకు శ్రీహరికోట నుంచి నిప్పులు కక్కుతూ విక్రమ్-1 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. తొలత షెడ్యూల్ చేసిన సమయానికి సాంకేతిక సమస్య ఏర్పడడంతో 12.05 నిమిషాలకు రాకెట్‌ను నింగిలోకి పంపించారు శాస్త్రవేత్తలు.
అయితే రాకెట్ లాంచ్‌కు అన్ని సిద్ధం చేసిన తర్వాత ఆఖరి నిమిషంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో తొలుత రాకెట్ ప్రయోగాన్ని నిలిపివేసినట్టు శాస్త్రవేస్తలు తెలిపారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం రాకెట్ నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉండగా.. లాంచ్ ప్యాడ్ నుండి రాకెట్ బయలుదేరే కొద్ది నిమిషాల ముందు సిస్టమ్స్‌లో సాంకేతిక లోపాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. దీంతో ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా ముందుజాగ్రత్త చర్యగా ప్రయోగాన్ని తాత్కాలికంగా ఆపేశారు.
అయితే ఆఖరి నిమిషంలో తలెత్తిన సాంకేతిక సమస్యకు కారణం ఏంటనే విషయాన్ని నిశితంగా పరిశీలించిన శాస్త్రవేత్తల బృందం దాన్ని సరిచేసి మళ్లీ కౌంట్‌డౌన్‌ను స్టార్ట్ చేశారు. మధ్యాహ్నం 12:05 నిమిషాలకు రాకెట్ ప్రయోగాన్ని చేపట్టనున్నట్టు స్పష్టం చేశారు. సాంకేతిక సమస్య కారణంగా రాకెట్ ప్రయోగాన్ని 35 నిమిషాల ఆలస్యం చేసినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.
రాకెట్ లాంచింగ్‌కు సంబంధించిన అప్‌డేట్స్ ఇక్కడ చూడండి.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం చేయండి.
