Vijayawada: కోలుకుంటున్న విజయవాడ.. 10 రోజులుగా కలెక్టరేట్‌లోనే సీఎం చంద్రబాబు

|

Sep 10, 2024 | 9:35 AM

వరద తగ్గుముఖం పట్టడంతో బురద బాగా పేరుకుపోయింది. దీంతో అనేక రకాల వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్న నేపధ్యంలో పారిశుధ్యం పనులు వేగంగా సాగుతున్నాయి. అంతేకాదు బాధితులకు సహాయక చర్యలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. మరోవైపు ఇంటింటికీ నష్ట గణన సర్వే తో పాటు హెల్త్ సర్వే కూడా కొనసాగుతోంది. అనేక వాహనాలు, ఫ్రిజ్, గ్యాస్ స్టవ్ సహా ఇతర నిత్యావసర వస్తువుల వంటి వరద నీటిలో మునిగిపోయాయి. వీటి మరమ్మత్తులకు మెకానిక్ లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.

Vijayawada: కోలుకుంటున్న విజయవాడ.. 10 రోజులుగా కలెక్టరేట్‌లోనే సీఎం చంద్రబాబు
Vijayawada Floods
Follow us on

భారీ వర్షాలు కారణంగా బుడమేరు వాగు పొంగి ప్రవహించడంతో విజయవాడ నగరం వరదల్లో చిక్కుతుంది. గత కొన్ని రోజులుగా వరద ప్రభావంతో జలదిగ్భందంలో చిక్కుకున్న కాలనీల్లో నీరు తగ్గుముఖం పడుతూ వస్తోంది. అవును వరద ప్రభావం నుంచి విజయవాడ క్రమేపీ కోలుకుంటోంది. బుడమేరు వాగుకి ఏర్పడిన గండ్లు పూడ్చడంతో పాటు మరోవైపు వరుణుడు శాంతిచడంతో వరద ప్రభావిత ప్రాంతాలు జలదిగ్బంధం నుంచి బయటపడుతున్నాయి. మరీ లోతట్టు ప్రాంతాలు తప్ప దాదాపు అనేక కాలనీలు సాధారణ స్థితి కి చేరుకుంటున్నాయి. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజలు, సిని, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులతో పాటు పలు స్వచ్చంద సంస్థలు కూడా ముందుకొచ్చాయి. ఆహారం, పాలు, మంచి నీరుతో పాటు బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు బాధితులందరికి నిత్యావసర వస్తువులు, డ్రై ఫుడ్ పంపిణీ చేశారు. అయితే వరదలో చిక్కుకున్న కాలనీ వాసులు కట్టు బట్టలతో మిగిలారన్న సంగతి తెలిసిందే.. వరద బాధితులందరికీ తలా ఒక జత బట్టలు పంపిణీ చేయాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

వరద పోయి మిగిలిన బురద.. పారిశుధ్యం పనులు ముమ్మరం

వరద తగ్గుముఖం పట్టడంతో బురద బాగా పేరుకుపోయింది. దీంతో అనేక రకాల వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్న నేపధ్యంలో పారిశుధ్యం పనులు వేగంగా సాగుతున్నాయి. అంతేకాదు బాధితులకు సహాయక చర్యలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. మరోవైపు ఇంటింటికీ నష్ట గణన సర్వే తో పాటు హెల్త్ సర్వే కూడా కొనసాగుతోంది. అనేక వాహనాలు, ఫ్రిజ్, గ్యాస్ స్టవ్ సహా ఇతర నిత్యావసర వస్తువుల వంటి వరద నీటిలో మునిగిపోయాయి. వీటి మరమ్మత్తులకు మెకానిక్ లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.

సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న సీఎం

వరద ప్రభావిత ప్రాంతాల్లో సిఎం చంద్రబాబు పర్యటించారు. స్వయంగా క్షేత్ర స్థాయిలో వరద ప్రభావాన్ని తెలుసుకున్నారు. ఇక పదో రోజూ ఎన్టిఆర్ జిల్లా కలెక్టరేట్ లోనే ఉంటూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు ముఖ్యమంత్రి చందరబాబు నాయుడు. ఈ రోజు సాయంత్రానికి చాలా ప్రాంతాలలో సహాయక చర్యలు పూర్తి అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత 10 రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే ఉంటూ సహాయక చర్యల్లో పూర్తి స్థాయిలో నిమగ్న,అయ్యారు అధికారులు.. ఈ సాయంత్రం పరిస్థితిని మరోసారి సమీక్షించి కలెక్టరేట్ నుంచి తన నివాసానికి వెళ్ళే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సాయంత్రం ఐదుగంటలకు సహాయక చర్యల్లో పాల్గొన్న ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఆపద సమయంలో కష్టాలు సైతం లెక్కచేయకుండా నిరంతరం పని చేసిన అధికారుల సేవలను ప్రభుత్వం అభినందించనున్నది. ఇక ఈ రోజు రాత్రి ఏడుగంటలకు మీడియా సమావేశాన్ని నిర్వహించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.

ఇవి కూడా చదవండి

విశాఖ కు వెళ్ళే ఆలోచనలో సీఎం చంద్రబాబు

ఉత్తరాంధ్ర తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ సాయంత్రం మరోసారి ఉత్తరాంధ్ర వర్షాలపై సమీక్షించి అవసరమైతే విశాఖ కు వెళ్ళే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. అంతేకాదు భారీ వర్షాలు కురుస్తున్న ఉత్తరాంద్రలో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. వర్షాలు, వరదలకు ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు. అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితి పూర్తి నియంత్రణ లో ఉందని, ప్రస్తుతానికి అత్యావస్యక స్థితులు లేవని అధికారులు వివరించారు.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..